గత నెల రోజులుగా దేశ వ్యాప్తంగా వానలు ధంచికొడుతున్నాయి. వారం రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో వానలు బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా బీహార్ లో వాన బీభత్సం సృష్టించింది. రైళ్ల రాకపోకలూ ప్రభావితం..మంత్రుల ఇళ్లలోకి వాన నీరు చేరాయి.  పట్నా సమా, పలు ప్రాంతాల్లో పూర్తిగా మునిగిపోయిన రోడ్లు.

వర్షం నీరు ఏకంగా డిప్యూటీ సీఎం సుశీల్ మోడీ ఇంట్లోకి వచ్చి చేరాయి. . ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పాట్నాలో లోతట్టు ప్రాంతాలు జలమలమయ్యాయి. కొన్ని కాలనీల్లోకి భారీగా వరద నీరు చేరింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్లలోకి నీళ్లు చేరడంతో జనం అవస్థలు పడుతున్నారు.

జనం ఇళ్లపైకి ఎక్కారు. కాలువ పక్క ఉన్న ఇళ్లున్నవారికి పరిస్థితి దయనీయంగా మారింది. ఈ వానకు తోడు ఈదురు గాలులు  బీభత్సం సృష్టించినట్లు సమాచారం. భారీ వర్షాలు, తీవ్రమైన గాలులకు పలుచోట్ల ఇళ్లు, చెట్లు కూలిపోయాయి.   తీసుకోవలసిన జాగ్రత్తలపై ఆయన అధికారులతో మాట్లాడారు. తక్షణమే చర్యలు చేపట్టాలని ఆదేశించారు.మెయిన్ రోడ్డుపై ఉన్న పలు దుకానాలు నీటిలో మునిగాయి. జనజీవనం అస్తవ్యస్తమైంది. శనివారం వర్షం వెలిసినా… నీళ్లు మాత్రం రోడ్డుపై అలాగే ఉండిపోయాయి. పాట్నాతో పాటు 13 జిల్లాలలో కూడా వర్షాలు భారీగా కురిశాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: