ఏపీ ప్రభుత్వం మరోసంచలన నిర్ణయంతో తెర మీదికి వచ్చింది వైసీపీ ప్రభుత్వం . అక్టోబరు 1 నుండి ఆంధ్రప్రదేశ్లో నూతన మద్యం విధానం అమలు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించినట్లు ఎక్సైజ్ మంత్రి నారాయణస్వామి తెలిపారు. ప్రస్తుతం 450 మద్యం షాపులు ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తుండగా... పూర్తిస్థాయిలో బెల్టుషాపులను రద్దు చేసి ప్రభుత్వం పరిధిలోనే  3500 షాపులు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న షాపులను  నిర్వహించేందుకు ఔట్ సోర్సింగ్ కాంట్రాక్టు పద్ధతిలో నిరుద్యోగులకు ఉద్యోగాలు కూడా కల్పించేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. కాగా వీటిని పర్యవేక్షించడానికి 678 ఎక్సైజ్ కానిస్టేబుల్ ఉద్యోగాలని   కూడా భర్తీ చేయబోతున్నారు అని తెలిపారు. 

 

 

 

 అయితే రాష్ట్రంలో మద్యం వల్ల ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయని... అందువల్లే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. కాగా ప్రతిపక్ష, మహిళలు ఈ నూతన మద్యం విధానానికి సహకరించాలని మంత్రి కోరారు. కాగా దశలవారీగా రాష్ట్రంలో మద్యనిషేధం చేసేలా ప్రజలు అందరూ సహకరించాలని కోరారు.  ప్రస్తుతం ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న షాపుల్లో త్వరలో విషయం గురించి ప్రస్తుతం చర్చలు జరుగుతున్నట్లు త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని  తెలిపారు. ప్రభుత్వం నిర్వహించే దుకాణాలను ఉదయం 10 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు నిర్వహిస్తామని తెలిపిన మంత్రి...  రాష్ట్రంలో  బెల్టుషాపులను ఎక్కడ నిర్వహించకుండా కఠినమైన నిర్ణయాలు ప్రభుత్వం తీసుకుంటుందని తెలిపారు. అయితే ఈ షాపుల్లో  సమయంపై కూడా చర్చలు జరుగుతున్నాయని త్వరలోనే ఈ సమయాన్ని కుదించే  అవకాశం ఉందని మంత్రి తెలిపారు. 

 

 

 ఎవరైనా మహిళలు తమ ప్రాంతాల్లో మద్యం దుకాణం పెట్టవద్దు అని అంటే... అక్కడి పరిస్థితుల ఆధారంగా షాపును నిర్వహించాల వద్ద అని నిర్ణయం  తీసుకుంటామని మంత్రి తెలిపారు. ప్రస్తుతం బెల్టు  షాపులు నిర్వహిస్తున్న వారికి ప్రభుత్వం కలెక్టర్ లతో  మాట్లాడి... వేరే ఉపాధి కల్పించేలా ప్రభుత్వ చర్యలు చేపడుతున్నట్టు  తెలిపారు మంత్రి తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: