ఏ రోజు అయితే జమ్ము మరియు కాశ్మీర్ ని మన దేశంలో అంతర్గతం చేసి ఒక ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించారో... ఆ రోజు నుంచి పాకిస్తాన్ పరిస్థితి అగ్గి మీద గుగ్గిలంగా తయారయింది. ప్రపంచ దేశాల మధ్యకు ఎన్నో రకాలుగా ఈ విషయాన్ని తీసుకెళ్లి మళ్ళీ తిరిగి కశ్మీర్ పై ఆధిపత్యం చెలాయిద్దాం అనుకుంటున్న పాకిస్తాన్ కు అడుగడుగునా అడ్డంకులు ఏర్పడుతున్నాయి. 

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ఈ విషయంలో తాను ఏమీ చేయలేని... మీ రెండు దేశాలు కూర్చొని మాట్లాడుకుని సర్దుపరచుకోవాల్సిన విషయం ఇది అని ఆయన అన్నాడు. దీంతో తన నిస్సహాయతను పాకిస్తాను భరించలేక జమ్మూ అండ్ కాశ్మీర్ లో జరిగిన దాడికి సిద్ధం అవుతుంది అని ఇంటలిజెన్స్ వర్గాలు ముందు నుంచే హెచ్చరిస్తున్న నేపథ్యంలో జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.

దాదాపు 80 కేజీల ఆయుధాలను కలుస్తాం ఖలిస్తాన్ జిందాబాద్ ఫోర్స్ నెట్వర్క్ చైనీస్ డ్రోన్ల ద్వారా పంజాబ్ రాష్ట్రంలోకి తరలించినట్లు సెక్యూరిటీ ఏజెన్సీలు తెలిపాయి. ఈ నెల 9 నుండి 16వ తేదీల మధ్యలో దాదాపు 80 కేజీల బరువున్న తుపాకులు, గ్రెనేడ్లు మరియు తూటాలు తాము పట్టుకున్నట్లు పంజాబ్ పోలీస్ మరియు సెక్యూరిటీ ఏజెన్సీ అధికారులు ఖరారు చేశారు. ఈ ఖలిస్తాన్ జిందాబాద్ ఫోర్స్ నెట్వర్క్ పాకిస్తాన్ స్పై ఏజెన్సీ మరియు ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ తో ముడిపడి ఉండడం గమనార్హం. కాబట్టి జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఉగ్రదాడి చేసి శాంతిభద్రతలకు భంగం కలిగించడమే పాకిస్తాన్ లక్ష్యంగా స్పష్టం గా కనబడుతోంది.

ఆయుధాలు తరలిస్తున్న అమృత్సర్, తర్న్ తరన్ వద్ద కనిపించగా ఆయుధాలను తీసుకెళ్లడానికి వచ్చిన ఒక మారుతి స్విఫ్ట్ కారును పోలీసులు పట్టుకున్నారు. ఇందులో ఐఎస్ఐ కి కూడా భాగం ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. అలాగే జమ్మూ అండ్ కాశ్మీర్ సరిహద్దు ప్రాంతంలో కూడా ఇలాంటి ఒక డ్రోన్ ను సైనిక బలగాలు కాల్చేసినట్లు ఇంతకు ముందు తెలిసిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: