మహానగరం హైదరాబాద్ లోని నీలోఫర్ హాస్పిటల్ లో జరిగిన దారుణం గురించి మనందరికీ తెలిసిందే. చిన్నారుల ప్రాణాలు కాపాడాల్సిన డాక్టర్లు కాసులకు కక్కుర్తిపడి రహస్యంగా క్లినికల్ ట్రయల్స్ చేస్తున్న విషయంతో ఇక ప్రైవేట్ హాస్పిటల్ లో చిన్నారులని చేర్చాలంటేనే తల్లితండ్రులను భయభ్రాంతులకు గురి చేసే పరిస్థితి ఏర్పడింది. దాదాపు 50 మంది పిల్లలపై రహస్యంగా ఔషధాలు మరియు వ్యాక్సిన్లు పరీక్షించి దాని ద్వారా వచ్చే ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ కు కారణమయ్యారు వైద్యులు. ఫార్మా కంపెనీలు కొత్తగా రూపొందించిన ఔషధాలు మరియు వ్యాక్సిన్లను గుట్టుచప్పుడు కాకుండా ఉపయోగిస్తున్న వారిపై ఇంకా తెలంగాణ ప్రభుత్వం విచారణ జరుపుతూనే ఉంది.

అయితే ఎంతో కాలంగా జరుగుతున్న ఈ దారుణం ఒక్కసారిగా బయటకు రావడానికి గల కారణం చాలా విచిత్రంగా ఉంది. పసిపిల్లల మంచి కోసమే అన్నట్లు ఒక్కసారిగా బయటికి వచ్చిన ఈ వార్త ప్రతి ఒక్కరినీ షాక్ కు గురి చేసింది. క్లినికల్ ట్రయల్స్ చేసినందుకు కొందరు డాక్టర్లకు ఫార్మా కంపెనీలు భారీ మొత్తం చెప్పగా ఇందులో డబ్బు విషయంలో ఇద్దరు డాక్టర్లు గొడవ పడటంతో ఈ క్లినికల్ ట్రయల్స్ వ్యవహారం బయటకు పొక్కింది. 

ఒకవేళ వారిద్దరి మధ్య అసలు గొడవ జరగకపోయి ఉంటే ఇంకా ఎన్నిరోజులు ఎంత మంది చిన్నారులు విగతజీవులుగా మారేవారో మీ అంచనాకే వదిలేస్తున్నాం. అయితే గత కొన్నాళ్లుగా నడుస్తున్న ఈ వ్యవహారాన్ని ఏ ఒక్క అధికారి గుర్తించకపోవడం రాష్ట్రంలో వైద్య విభాగాల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మనకి తెలియజేస్తుంది. జంతువుల మీద ప్రయోగించాల్సిన మందులు తీసుకువచ్చి రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న చిన్నారులపై ఉపయోగించడం.... ఇంకా ఈ విషయం లేటుగా బయటకు రావడం వెనుక ఎవరి హస్తం ఉందన్న విషయం ఇంకా తేలాల్సి ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: