ఎండగా ఉంటె గొడుగు పట్టుకొని బయటకు వెళ్తారు.. ఇంకా వేడిగా ఉంటె కూలింగ్ గ్లాస్ పెట్టుకొని, కూల్ కూల్ గా బయటకు వెళ్లడం చూస్తుంటాం.  ఉక్కపోతగా ఉంటె ఫ్యాన్ కింద కూర్చోవడంమో, చల్లని ప్రాంతానికి వెళ్లడమో చేస్తుంటారు.  కానీ, ఓ మహిళా అందరికి విరుద్ధంగా చేసింది.  సభ్యసమాజం తలదించుకునేలా చేసింది. ఉక్కపోతగా ఉండటంతో.. సదరు మహిళ నడిరోడ్డుమీద వేసుకున్న బట్టలు విప్పేసింది.  


నగ్నంగా మారిపోయింది.  దీంతో చుట్టుపక్కల ఉన్న ప్రజలంతా చూసి షాక్ అయ్యారు.  బట్టల విషయంలో స్వేచ్ఛ ఉండొచ్చు.  చాలామంది అమెరికాలో బికినీ వేసుకొని తిరుగుతున్నారు.  నడిరోడ్డుమీద కాదు.. బీచ్ లో తిరుగుతుంటారు.  కానీ, ఇలా దుస్తులు విప్పేసి తిరిగేందుకు ఎవరూ సాహసించరు.  ఈ మహిళా ఇలా చేయడం వెనుక అర్ధం ఏంటో తెలియక పోలీసులకు ఫిర్యాదు చేశారు.  వెంటనే స్పందించిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.  


ఎందుకిలా చేశారని ప్రశ్నిస్తే.. రకరకాలుగా సమాధానాలు చెప్పింది.  ఒకవేళ మద్యం మత్తులో అలా చేసిందా అని పరిక్షిస్తే.. ఆమె తాగనట్టు తెలిసింది.  ఉక్కపోతగా ఉండటం వలనే అలా చేసినట్టు ఆమె చెప్పింది.  దీంతో పోలీసులకు పాపం తెల్లముఖాలు వేశారు.  ఫ్రెండ్‌ను కలిసేందుకు బయటకు వచ్చానని, వేడి ఎక్కువగా ఉండటం వల్ల తిరిగి ఇంటికి బయల్దేరానని తెలిపింది. పోలీసులు ఆమెపై బహిరంగ ప్రాంతంలో అసభ్యకర ప్రవర్తన కింద కేసు నమోదు చేశారు. 


ఈ సంఘటన అమెరికాలోని టేనస్సీ రాజధాని నాష్విల్లెలో జరిగింది.  ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అక్కడ బట్టల విషయంలో స్వేచ్ఛ ఉంటుంది కాబట్టి పెద్దగా పట్టించుకోరు.  అదే ఇండియాలో అయితే నానారకాలుగా మాట్లాడుకునేవారు. రకరకాలుగా  చెప్పుకునేవారు.  కానీ, అది అమెరికా కాబట్టి దాని గురించి పెద్దగా పట్టించుకోలేదు.  ఏదైతేనేం ఇలాంటి న్యూస్ తో ఆ మహిళ సోషల్ మీడియాలో ఒక్కసారిగా వైరల్ అయ్యింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: