ఆర్టికల్ 370 రద్దు తరువాత జమ్మూ కశ్మీర్ లో పరిస్థితులు సద్దుమణుగుతున్నాయి.  అక్కడ పౌరులు ఎవరిపని వారు చేసుకుంటున్నారు.  ఉగ్రవాదులు  చొరబడతారనే ఉద్దేశ్యంతోనే ఆర్మీ ఇంకా అక్కడే ఉన్నది.  కొన్నాళ్ల తరువాత తప్పకుండా పరిస్థితులు సద్దుమణుగుతాయి.  అందులో సందేహం అవసరం లేదు.  కాగా, ఆర్టికల్ 370 రద్దు రాజ్యాంగానికి  విరుద్ధంగా జరిగిందని, అక్కడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పి సుప్రీం కోర్టులో కొంతమంది పిటిషన్లు దాఖలు చేశారు.  


ఈ పిటిషన్లను విచారించేందుకు సుప్రీం కోర్టు  ధర్మాసనం సిద్ధం అయ్యింది. సుప్రీం కోర్ట్ దీనికోసం ప్రత్యేకంగా రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది.  దానికి జస్టిస్ ఎన్.వి రమణ నేతృత్వంలో ఈ ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది.  అక్టోబర్ 1 వ తేదీ నుంచి దీనిపై విచారించనున్నారు.  అయితే, ఈ ధర్మాసనం ఎలాంటి తీర్పును ఇవ్వబోతుంది.  ఏ ఏ అంశాలను పరిగణలోకి తీసుకుంటుందో చూడాలి.  ఇప్పటికే కాశ్మీర్ అభివృద్ధిపై కేంద్రం దృష్టి పెట్టింది. 


సుప్రీం కోర్టు ఇచ్చే తీర్పు దీనికి ఆటంకం కలగకుండా ఉంటె అంతేచాలు.  ఎందుకంటే కాశ్మీర్ లో ప్రజలు కొంతమందికే ఆర్టికల్ 370 అమలులో ఉన్నప్పుడు ఉద్యోగాలు ఉన్నాయి.  అభివృద్ధి చాలా వరకు కొరవడింది. చాలామంది యువకులు రాళ్లు విసిరే ఉద్యోగాలు చేస్తూ వారి జీవితాలకు ముప్పు తెచ్చుకుంటున్నారు.  ఇప్పుడు చాలా వరకు ఆ సమస్య మారింది.  పాక్, చైనా వంటి దేశాలు పదేపదే ఈ విషయంపై స్పందించడం వలనే ఇలా జరుగుతుంది తప్పించి మరొకటి కాదు.  


సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గగోయి త్వరలోనే జమ్మూ కాశ్మీర్లో పర్యటించబోతున్నారు.  అక్కడి స్థితిగతులను   తెలుసుకోబోతున్నారు.  అక్కడి నుంచి వచ్చిన తరువాత అన్ని విషయాలు బయటకు వస్తాయి.  అందులో సందేహం అవసరం లేదు.  అక్టోబర్ 31 నుంచి జమ్మూ కాశ్మీర్, లడక్ లు అధికారికంగా కేంద్ర పాలిత ప్రాంతాలుగా మారబోతున్నాయి.  ఆ రోజు నుంచి కాశ్మీర్ లో హౌస్ అరెస్ట్ లో ఉన్న నేతలు బయటకు వస్తారు.  అప్పటి వరకు వారికీ నిర్బంధం తప్పదు.  కేంద్రపాలిత ప్రాంతంగా మారుతుంది కాబట్టి అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా దానికి తగిన చర్యలు తీవ్రంగా ఉంటాయి.  


మరింత సమాచారం తెలుసుకోండి: