పసిపిల్లల ప్రాణాలంటే వారికి లెక్కలేకుండా పోయింది.  వారిని జంతువుల కంటే హీనంగా చూస్తున్నారు.  జంతువులపై ప్రయోగాలు చేసినట్టుగా పసిపిల్లలపై ప్రయోగాలు చేస్తున్నారు.  ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అన్నది తెలియాలి.  పసిపిల్లలపై ప్రయోగాలు చేస్తూ.. వారిని శారీరకంగా హింసిస్తున్నారు.  ఏడాది కాలంగా నీలోఫర్ లో క్లినికల్ ట్రయల్ జరుగుతున్నట్టు విచారణలో తేలింది.  


ఇప్పటి వరకు 50 మందిపై క్లినికల్ ట్రయల్ నిర్వహించారనే అభియోగాలు వచ్చాయి.  కానీ, 50 మంది కాదు 300 మందిపై క్లినికల్ ట్రయల్ నిర్వహించినట్టు లెక్కలు తేలడంతో.. అందరు షాక్ అయ్యారు.  అయితే, ఈ క్లినికల్ ట్రయల్స్ ను వయసు వారీగా, వార్డుల వారీగా విభజించి క్లినికల్ ట్రయల్ నిర్వహించినట్టు తెలుస్తోంది. 100 మందిని జనరల్‌ వార్డు నుంచి, మరో 100 మందిని పీడియాట్రిక్‌ ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌ నుంచి, ఇంకో 100 మందిని నియోనాటల్‌ ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌  నుంచి ఎం పిక చేశారు. వీరిపై యాంటీ బయోటిక్స్‌ మందుల ప్రయోగం జరిగిందని నివేదిక తెలిపింది. 


ఇది చాలా దారుణమైన విషయం అని చెప్పాలి.  పిల్లలపై  క్లినికల్ ట్రయల్ పేరుతో యాంటీబయాటిక్స్ ప్రయోగించినపుడు.. దాని వలన అనేక సైడ్ ఎఫక్ట్స్ కూడా వస్తున్నాయి.  చాలామందికి ఇలా సైడ్ ఎఫెక్ట్స్ కూడా వచ్చినట్టు నివేదికలో తేలింది.  ఈ క్లినికల్ ట్రయల్స్ లో ఇద్దరు వైద్యులు పాల్గొన్నారు నివేదికలు చెప్తున్నాయి.  వారిని ఆయా కంపెనీల ప్రతినిధులు సహాయం చేసినట్టుగా నివేదిలో వెల్లడయింది.  అంతేకాదు, క్లినికల్ ట్రయల్స్ పదేళ్లుగా యథేచ్ఛగా సాగుతున్నాయని షాకింగ్ న్యూస్ నివేదిక ద్వారా బయటపడింది. 


మరి పదేళ్లుగా ఇలా క్లినికల్ ట్రయల్ జరుగుతుంటే నిలోఫర్ అధికారులు ఏం చేస్తున్నారు.  తెలియకుండా ఎలా ఉంటుంది అనే అనుమానాలు కలుగుతున్నాయి.  పది రోజుల క్రితం జరిగిన విషయం కాదు పదేళ్లుగా ఎలా బయటపడలేదు తెలియడం లేదు.  ప్రభుత్వం సైతం దీనిపై అశ్రద్ధ వహించడం కూడా ఇందుకు ఒక కారణమే.  ప్రభుత్వ హాస్పిటల్ ను పట్టించుకోకుండా అలా వదిలేశారు కాబట్టి నీలోఫర్ లో యధేచ్చకాగా దారుణాలు జరుగుతున్నాయి.  ఇప్పటికైనా సంబంధిత వ్యక్తులపై తీవ్రమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: