చేపలు పట్టుకోవాలని ఎంతమందికి ఉండదు. కొంతమంది డబ్బు కోసం చేపలను పెట్టుకొంటే మరికొంతమంది ఇష్టంతో చేపలను పట్టుకుంటారు. డబ్బు కోసం పట్టుకున్న వారు చేపలను అమ్మితే ఇష్టంతో పట్టుకున్నవారు వాటిని మళ్ళి తిరిగి వదిలేస్తారు. కొంతమంది ఇష్టంతో చేపలను పట్టుకున్న దాని ధర ఎక్కువ ఉంటె వొదిలెయ్యకుండా అమ్మేస్తారు.                  


కానీ ఓ మంచోడు దాదాపు 23 కోట్ల రూపాయిలు విలువ చేసే చేపను పట్టుకొని మళ్ళి సముద్రంలోకి వదిలేశాడు. వివరాల్లోకి వెళ్తే.. ఐర్లాండ్‌ తీరంలో ఎనిమిదిన్నర అడుగుల పొడవున్న ట్యూనా చేప వెస్ట్ కార్క్‌కి చెందిన డేవ్ ఎడ్వార్డ్స్ వలకు చిక్కింది. ఆ చేప బరువు 270 కిలోలు. మార్కెట్‌లో ధర రూ. 23 కోట్ల పైమాటే ఉంది. కానీ ఏ మాత్రం ఆలోచించకుండా ఆ చేపను సముద్రంలో వదిలేశాడు.                 


అయితే డేవ్ ఎడ్వార్డ్స్ చేపలు పట్టే ఉద్దేశంతో వలలు వెయ్యలేదని. తాము సరదా కోసమే చేపలు పడుతున్నామని, వాటిని అమ్మడం ఉద్దేశం కాదని చెప్పాడు. వారు ఉంటున్న ప్రాంతంలో ఎలాంటి చేపలు ఉన్నాయో తెలుసుకోవడానికే ఇలా చేపలను పట్టి వదిలేస్తున్నామని తెలిపాడు. అయితే ఆ భారీ ట్యూనా చేప వలకు చిక్కిన ఫోటోని తీసి ఫేస్ బుక్ లో పెట్టారు. దీంతో ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కాగా అంత కాస్టలీ చేపను నీళ్ళల్లో వదిలేయడంతో 'ఎంత మంచోడివి' డేవ్ ఎడ్వార్డ్స్ అంటూ మెచ్చుకుంటున్నారు.           


మరింత సమాచారం తెలుసుకోండి: