సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన తరువాత ఇంట్లో పొయ్యిలు చాలా వరకు వెలగడం లేదు.  సంపాదనపైనే అందరు దృష్టి పెట్టడంతో.. సంపాదనలో మునిగిపోయి.. వచ్చిన డబ్బులను తినేందుకు వివిధ యాప్స్ ద్వారా తిండి తెప్పించుకుంటున్నారు.  తినే తిండి దగ్గరి నుంచి వాడుకునే వస్తువుల వరకు అన్ని కూడా ఆన్లైన్ లో ఈజీగా దొరుకుతున్నాయి.  తక్కువ ధర.  ఒకవేళ ఇంట్లో చేసుకున్నా అంతే అవుతుంది.  అంతకంటే ఎక్కువ కావొచ్చు.  పైగా సమయం కూడా వృధా.  


అందుకే యువత ఇప్పుడు యాప్స్ పై ఆధారపడుతుంది.  ఒకప్పుడు బ్యాచులర్స్ మాత్రమే వీటిపై ఆధారపడేవారు.  కానీ, ఇప్పుడు ప్రతి ఒక్కరు యాప్స్ ను ఉపయోగించుకొని ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారు.  అయితే, ఒక్కోసారి ఇచ్చిన ఆర్డర్ ఒకటైతే.. వచ్చే ఆర్డర్ మరొకటి ఉంటుంది.  దీంతో వినియోగదారులు షాక్ అవుతున్నారు.  ఇటీవలే గుజరాత్ లోని అహ్మదాబాద్ కు చెందిన ఓ జాస్మిన్ పటేల్ అనే యువతి హక్కా నూడుల్స్ ను ఆర్డర్ చేసింది.  


డెలివరీ వచ్చిన తరువాత ఆ నూడుల్స్ ప్యాక్ ను చూసి షాక్ అయ్యింది.  విప్పి చూసి ఆలోచనలో పడింది.  తన ఫ్రెండ్ ను పిలిచి ఆ నూడుల్స్ ఏంటో చూడాలని చెప్పింది. వాటిని పరిశీలించిన యువతి అవి నాన్ వెజ్ నూడుల్స్ అని చెప్పడంతో.. పాపం ఆ యువతి షాక్ అయ్యింది.  వేంటనే ఆర్డర్ వచ్చిన రెస్టారెంట్ కు ఫోన్ చేస్తే సరైన రెస్పాన్స్ ఇవ్వలేదట.. అలానే యాప్ కస్టమర్ కేర్ కు కాల్ చేసినా ఉపయోగం లేకపోవడంతో ఏం చేయాలో తెలియక జాస్మిన్ పటేల్ సోషల్ మీడియాలో జరిగిన విషయాన్నీ పేర్కొంది.  


తనకు రెస్టారెంట్ నుంచి గాని, అటు యాప్ నుంచి గాని సరైన సమాధానం రాలేదని, ఫీడ్ బ్యాక్ సరిగా లేదని చెప్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.  ఇంకేముంది.  సోషల్ మీడియా మొత్తం ఒక్కసారిగా భగ్గుమంది.  ఇప్పటికే ఇలా చాలామందికి జరిగింది.  ఒకటి ఆర్డర్ చేస్తే మరొకటి చేతికి వస్తుంది.  వెజ్ ఆర్డర్ చేస్తే నాన్ వెజ్ రావడం.. నాన్ వెజ్ ఆర్డర్ చేస్తే వెజ్ రావడం సర్వసాధారణం అయ్యింది.  అంతెందుకు ఇండియన్ ఎయిర్ లైన్స్ లోనే ఇలా జరిగింది అంటే అర్ధం చేసుకోవచ్చు. 


మరింత సమాచారం తెలుసుకోండి: