జమ్మూ కాశ్మీర్ కాశ్మీర్ దేశానికీ తలలాంటిది.  అందుకే దాన్ని ఇండియా జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నది. ముష్కరుల దాడుల నుంచి కాపాడుకుంటోంది.  లోకల్ గా ఉండే కొంతమంది రాజకీయ నాయకుల నుంచి కాపాడుకుంటూ వస్తున్నారు. భారతదేశానికి స్వాతంత్య్రానికి పూర్వం జమ్మూ కాశ్మీర్ నుంచి పాకిస్తాన్ అంతా ఇండియాలో భాగస్వామ్యమే.  బ్రిటిష్ దొరలు వెళ్తూ వెళ్తూ ఇండియాను విడగొట్టి వెళ్లిపోయారు.  అనంతరం పాక్ బోర్డర్ ఉల్లంఘనలను పక్కన పెట్టి కాశ్మీర్  ను ఆక్రమించుకోవాలని చూసింది.  


అప్పటికే కొంతభాగం పాక్ సొంతం చేసుకుంది.  పాక్ ఆక్రమిత కాశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతున్నట్టు ఇప్పటికే ఎన్నోసార్లు ఎంతోమంది చెప్తూ వస్తున్నారు.  పాక్ మాత్రం తన బుద్దిని మార్చుకోవడం లేదు.  ఇది వేరే విషయం అనుకోండి.  ఇండియా మొత్తం బ్రిటిష్ అధీనంలో ఉన్నా.. కాశ్మీర్ మాత్రం రాజుల ఆదీనంలోనే ఉన్నది. బ్రిటిష్ దొరలు కాశ్మీర్లోకి ప్రవేశించి అక్కడ ఇల్లు నిర్మించుకోవాలని అనుకున్నారు.  


కానీ అక్కడ ఇల్లు నిర్మించుకోవడానికి మహారాజు అనుమతి ఇవ్వలేదు.  దీంతో 1888లో సర్ కోనార్డ్ అనే బ్రిటిషర్ ఉండేందుకు ఒక చిన్న బోట్ హౌస్ నిర్మించుకున్నాడు.  అదే కాశ్మీర్ లో నిర్మించిన మొదటి బోట్ హౌస్.  అందులో ఒక చిన్న రూమ్, టాయిలెట్ ఉండేవి.  ఆ తరువాత కాలక్రమేణా వరసగా బోట్ హౌస్ ల నిర్మాణం జరుగుతూ వచ్చింది.  ఒకదాని తరువాత మరొకటిగా బోట్ హౌస్ లు నిర్మించుకుంటూ వస్తున్నారు.  


ఇప్పుడు అక్కడ పర్యాటక రంగం అభివృద్ధి చెందిన తరువాత ఎక్కడ చూసినా చైనా పెద్ద బోట్ హౌస్ లు కనిపిస్తుంటాయి.  అందరిని యిట్టె ఆకర్షిస్తుంటాయి.  అందుకే బోట్ హౌస్ లకు కాశ్మీర్ పెట్టింది పేరు.  పైగా వాటి నిర్మాణ శైలి కూడా చాలా అద్బుతంగా ఉంటుంది.  నగిషీలు, కలంకారీ పనితనం అన్ని అద్భుతంగా ఉంటాయి.  అందుకే అవి అందరిని ఆకట్టుకుంటున్నాయి.  ఇప్పుడు ఆర్టికల్ 370 రద్దు తరువాత కాశ్మీర్లో తిరిగి టూరిజం డెవలప్ అవుతుంది అనడంలో సందేహం అవసరం లేదు.  దేశవిదేశాల నుంచి టూరిస్టులు తప్పనిసరిగా ఇండియా వచ్చినపుడు కాశ్మీర్ ను సందర్శిస్తుంటారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: