కాంగ్రెస్ పార్టీకి వరసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి.  ఇప్పటికే పార్టీ దేశంలో చాలా వరకు దెబ్బతిన్నది.  దేశం మొత్తం మీద కేవలం 44 స్థానాలు మాత్రమే దక్కించుకుంది.  ఇది దారుణమైన విషయంగా చెప్పుకోవాలి.  ఇదిలా ఉంటె, కర్ణాటకలో అంతర్గత కలహాల కలహాల కారణంగా ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.  ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయింది.  


ఫలితంగా పార్టీ ఇబ్బందుల్లో పడింది. కాగా ఇప్పుడు రాజీనామాలు చేసిన బహిష్కృత ఎమ్మెల్యేలు సుప్రీం కోర్టుకు వెళ్లారు.  అక్కడ సుప్రీం లో వాదనలు నడుస్తున్నాయి.  సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చే వరకు కర్ణాటక ఉప ఎన్నికలు ఆపాలని కోర్టు పేర్కొన్న సంగతి తెలిసిందే.  ఇదిలా ఉంటె, కాంగ్రెస్ పార్టీ కి ఇప్పుడు మరో ఎదురు దెబ్బ తగిలింది.  ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ అనిల్ లాడ్ కాంగ్రెస్ పార్టీని వదిలి బీజేపీలో జాయిన్ కాబోతున్నారు. 


దీనికి సంబంధించిన అన్ని విషయాలు పూర్తయినట్టు సమాచారం.  అక్టోబర్ 5లేదా 6 వ తేదీన అయన యడ్యూరప్ప సమక్షంలో పార్టీలో చేరబోతున్నట్టు తెలుస్తోంది.  బళ్లారి నగరం నుండి మూడు సార్లు ఎమ్మెల్యేగా కాంగ్రెస్‌ పార్టీ తరుపున పోటీ చేసి ఒక సారి గెలిచారు. ఒక సారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ముఖ్యంగా పార్టీ వీడడానికి కాంగ్రెస్‌ నాయకుల్లో ఉండే అంతర్గత విభేదాలే కారణం అని అయన అంటున్నారు.  కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాల కారణంగానే సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయిందని అన్నారు.  


ఇక గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు తన ఓటమికోసం పనిచేశారని, బళ్లారి జిల్లాకు ఇద్దరు ఎమ్మెల్సీలు ఉన్నప్పటికీ వారి వలన ఒరిగింది ఏమి లేదని, జిల్లాకు నిధులను తీసుకురావడంలో వెనకబడిపోయారని అన్నారు.  ఇక అనిల్ కాంగ్రెస్ పార్టీని అర్ధాంతరంగా వీడుతుండటంతో ఆ పార్టీ నేతలకు, కార్యకర్తలకు అర్ధం అకావడం లేదు.  ఎందుకు అయన కాంగ్రెస్ పార్టీని వదిలి వెళ్తున్నాడో తెలియక అయోమయంలో పడిపోయారు.  డి కె శివకుమార్ కు జరిగిన విధంగా అనిల్ కు కూడా జరుగుతుందేమో అని భయపడి అలా చేసి ఉండొచ్చని పలువురు నేతలు చెప్తున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: