కొన్నిసార్లు ప్రమాదాలు అనుకోకుండా జరుగుతాయి. ప్రమాదాలు జరిగిన సమయంలో కొన్ని సెకన్ల పాటు మైండ్ పని చేయదు. ప్రమాదం నుండి తప్పించుకోవాలంటే ఏం చేయాలనే ఆలోచన కూడా వెంటనే రాదు. కానీ ఒక మందుబాబు మాత్రం తన తెలివితో ప్రమాదం నుండి  తన కారును కాపాడుకున్నాడు. ఎటువంటి టెన్షన్ పడకుండా తనకు ఎదురైన ప్రమాదం నుండి సురక్షితంగా బయటపడ్డాడు. 
 
జర్మనీ దేశంలోని బవేరియా రాష్ట్రంలో హెచ్సాబ్ అనే ఒక నగరం ఉంది. ఆ నగరంలో ఒక మందుబాబు తాగటం కొరకు ఆరు బీరు బాటిల్స్ కొనుక్కున్నాడు. ఆ తరువాత ప్రయాణ సమయంలో అకస్మాత్తుగా కారు ఇంజిన్ నుండి మంటలు వచ్చాయి. ఆ మంటలను చూసిన మందుబాబు ఏ మాత్రం టెన్షన్ పడలేదు. తాపీగా తాగటం కొరకు కొన్న బీరు బాటిల్స్ తీసుకొని కారు నుండి బయటకు దిగాడు. 
 
కారు ఇంజిన్ పై బీరు బాటిల్స్ ఓపెన్ చేసి బీరు పోశాడు. వెంటనే ఇంజిన్ కు అంటుకున్న మంటలు అన్నీ ఆరిపోయాయి. సాధారణంగా ఎవరికైనా బీరు పోస్తే మంటలు ఇంకా పెరుగుతాయి కదా అనే సందేహం వస్తుంది. కానీ బీరు పోస్తే మంటలు పెరగవు. ఎందుకంటే బీరులో ఎక్కువ మోతాదులో నీరు ఉంటుంది. ఆ నీరు మంటలు ఆరిపోవటానికి కారణం అవుతుంది. 
 
ఈ ఘటన జరిగిన సమయంలో ఆ ప్రాంతంలో ఉన్న పోలీసులు ఫైర్ ఇంజిన్ కు ఫోన్ చేసి మంటలు అంటుకున్న విషయాన్ని తెలియజేశారు. కానీ ఆ ఫైర్ ఇంజిన్ వచ్చే సమయానికే మందుబాబు తెలివిగా మంటలను ఆర్పివేశాడు. ఒక న్యూస్ ఛానల్ ఈ విషయాన్ని ప్రసారం చేసింది. సోషల్ మీడియాలో మందుబాబు చేసిన పని వైరల్ కావటంతో నెటిజన్లు ఈ వ్యక్తిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: