పాత్రికేయులు తీవ్రమైన ఒత్తిడులను ఎదుర్కొంటున్నారని ప్రముఖ గుండె వైద్య నిపుణులు డాక్టర్. మన్నం. గోపీచంద్ చెప్పారు. అంత ఒత్తిడిలోనూ వృత్తిపరంగా క్రమశిక్షణతో వ్యవహరిస్తున్నారని అన్నారు. ఆదివారం స్టార్ హాస్పిటల్స్ 11 వ వార్షికోత్్వాన్ని పురస్కర్షించుకుని పాత్రికేయులు, వారి కుటుంబసభ్యులకు గుండెకు సంబంధించి వ్యాధి నిర్ధారణ ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన ఈ వైద్య శిబిరంలో   డా, గోపీచంద్ ఆధ్వర్యంలో గుండె వైద్య నిపుణులు ఉచితంగా వైద్య పరీక్షలు జరిపారు. ఈ సందర్బంగా గోపీచింద్ మాట్లాడారు. 


పాత్రికేయులు ఒక సమయం, సందర్బమంటూ లేకుండా అంకిత భావంతో ముందుకు సాగుతున్నారని చెప్పారు. ఆటువంటి వారికీ వైద్య సేవలను అందించండం తృప్తిగా ఉందన్నారు. అందులోను వరల్డ్ హార్ట్ డే సందర్బంగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరి  గుండెను పదిలంగా ఉండాలన్న దృఢ సంకల్పంతో స్టార్ హాస్పిటల్ ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. అందులో భాగంగానే ఈ ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించామన్నారు. ప్రధానంగా గుండె పరీక్షలు, శస్త్ర చికిత్సల కోసం అధునాతనమైన  సాంకేతిక పద్ధుతులను అందుబాటులోకి తెచ్చామన్నారు. ఈ క్రమంలో రోగికి సంపూర్ణమైన వైద్య సదుపాయాన్ని అందిస్తున్నట్టు చెప్పారు. 



ఈ వైద్య శిబిరంలో కూడా గుండెకు సంబంధించిన రక్తపోటు, ఈసీజీ, 2 డి ఈకో , సుగర్ వంటి పరీక్షలను ఉచితంగా చేశామన్నారు. గుండెను పదిలపర్చుకునే విషయంలో జాగ్రత్తలు తెసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఎందులో భాగంగా వ్యాయామం చేస్తూ..ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలన్నారు. ముఖ్యంగా సమయపాలన పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మద్యపానం, ధూమపానం వబ్టి అలవాట్లకు దూరంగా ఉండాలన్నారు. పాత్రికేయులకు ప్రత్యేకించి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం ముదాహమని పలువురు పాత్రికేయులు అన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య నిపుణులు డా. వంశీ కృష్ణ, డా. హరిత, ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: