రచ్చబండ ఈ పేరు చెబితే కళ్ళ ముందు కదిలే రూపం వైఎస్సార్ ది. ఆయన ఈ కార్యక్రమానికి రూపకర్త. ఓ విధంగా ఆయన డ్రీం ప్రోగ్రాం గా చెప్పాలి. కానీ ఆయన తన కలను నెరవేర్చుకోలేకపోయారు. సెప్టెంబర్ 2 2009న చిత్తూరు జిల్లాలో రచ్చబండ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం కోసం హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో బయల్దేరిన వైఎస్సార్ కానరాని లోకాలకు వెళ్ళిపోయారు. ఆ తరువాత వచ్చిన కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఎవరూ రచ్చబండ వూసు కూడా తలవలేదు. ఓ విధంగా దాన్ని యాంటీ సెంటిమెంట్ గా భావించేవారంటారు.


రచ్చబండ కార్యక్రమం తన తండ్రి మానస పుత్రిక కాబట్టి దాన్ని  పునరుద్ధరించి జనాల్లోకి వెళ్ళాలన్నది జగన్ ఆలోచన. తండ్రి పేరు మీద అన్ని కార్యక్రమాలు జగన్ చేస్తున్నారు. అవి విజయవంతం అవుతున్నాయి. కానీ రచ్చబండ మాత్రం ఎందుకో ఇబ్బంది పెడుతోంది. నిజానికి సెప్టెంబర్ నెలల్లోనే దీనికి శ్రీకారం చుట్టాలని జగన్ అనుకున్నారు. కానీ కర్నూల్ జిల్లాకు వెళ్దామనుకుంటే హెలికాప్టర్  ల్యాండింగ్ కి సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. దీనికి సంబంధించి కర్నూల్ కలెక్టర్ ఏడుగురికి నోటీసులు  కూడా ఇచ్చారు. ఓ విధంగా ఇది యాంటీ సెంటిమెంట్ గానే వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి.


ఈ నేపధ్యంలో జగన్ రచ్చబండ కార్యక్రమానికి స్వస్తి చెబితేనే బెటర్ అని అంటున్నారు. వైఎస్సార్ ని రచ్చబండ పొట్టన పెట్టుకుందన్న బాధ చాలామందిలో ఉంది. మరి అటువంటి దానిలో అనవసరంగా వేలుపెట్టి జగన్ తన పొలిటికల్ కెరీర్ ని ఫణంగా పెట్టరాదన్న భావన కూడా చాలా మందిలో ఉంది. జగన్ కావాలంటే వేరే పేరు మీద జిల్లాల టూర్లు చేసుకోవచ్చునని కూడా సూచించిన వారు ఉన్నారు. మరి జగన్ ఈ విషయంలో పునరాలోచిస్తే మంచిదని అంటున్నారు


మరింత సమాచారం తెలుసుకోండి: