ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు చేసిన పాపాలు ఇప్పుటి సీఎం జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డికి శాపాలుగా మారాయా..? త‌న అధికార ప‌బ్బం గడుపుకునేందుకు చంద్ర‌బాబు చేసిన త‌ప్పులు ఇప్పుడు అవి ఏపీకి గుదిబండ‌గా మారాయా..?  నాడు చంద్రాలు ఓట్ల కోసం చేసిన డ్రామాలు ఇప్పుడు ఏపీ ప్ర‌జ‌ల‌కు న‌ర‌కం చూపే న‌క‌ళ్ళు అయ్యాయా..? ఆనాడు చంద్ర‌బాబు చేసిన త‌ప్పుడు నిర్ణ‌యాల వ‌ల్ల ఏపీ కారుచీక‌ట్లో కి నెట్ట‌బ‌డుతుందా...?  అస‌లు ఏపీలో విద్యుత్ ఉత్ప‌త్తికి ఉన్న అవ‌కాశాల‌ను చంద్రబాబు నాయుడు  ఉప‌యోగించుకోక‌పోవ‌డం, ఉన్న వ‌న‌రుల‌ను కాపాడుకోలేక పోవ‌డం, భ‌విష్య‌త్ అవ‌స‌రాల దృష్ట్యా స‌రైన నిర్ణ‌యాలు స‌కాలంలో తీసుకోక‌పోవ‌డం ఇప్పుడు ఏపీని అంధ‌కారంలోకి నెట్ట‌నున్న‌దా అంటే అవున‌నే స‌మాధానాలు వినిపిస్తున్నాయి..


అయితే విద్యుత్ స‌మ‌స్య‌లు అనేవి చెప్పితే సామాన్య జ‌నాల‌కు అర్థ‌మ‌య్యేటివి కావు. ఇవి టెక్నిక‌ల్ స‌మ‌స్య‌లు. విద్యుత్ ఒప్పందాలు ముందుగా చేసుకుంటేనే అవి భ‌విష్య‌త్తులో స‌ర‌ఫరా చేసుకునేందుకు అవ‌కాశం ఉంటుంది. కానీ అప్ప‌టి క‌ప్పుడు ఒప్పందాలు చేసుకుంటే విద్యుత్ స‌మ‌స్య‌ను తీర్చే ప‌రిస్థితి రాదు.. అందుకే విద్యుత్ క‌ట్ కాగానే ఇంట్లో చీక‌టి రాగానే స‌ర్కారును నింద‌లు వేస్తూ ఉంటాం.. కానీ ఇవి పాల‌కులు స‌రైన స‌మ‌యంలో స్పందించ‌క‌పోవ‌డం వల్ల‌నే ఇప్పుడు వ‌చ్చిన స‌మస్య‌గా ఎవ‌రు గుర్తించ‌రు.. ఇప్పుడు అదే చంద్ర‌బాబు నాయుడు చేసిన కుటిల రాజ‌కీయాల‌కు అటు ఏపీ అంధ‌కారంలోకి నెట్ట‌బ‌డుతుండ‌గా, సీఎం జ‌గ‌న్‌కు ఇది శాప‌మ‌య్యే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.


ఇప్పుడు ప్ర‌తిప‌క్ష నేత‌గా చంద్రాలు, ఆయ‌న అనుచ‌రులు విద్యుత్ స‌మ‌స్య‌ల‌పై నోటికొచ్చిన‌ట్లు విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఇవి నిజ‌మేన‌ని జ‌నం అనుకుంటున్నారు.. కానీ అదే ప్ర‌తిప‌క్ష నేత చేసిన త‌ప్పులే అని ఎవ్వ‌రు అని నిజం చెప్ప‌డం లేదు.. ఎందుకంటే ఇప్ప‌టి విద్యుత్ స‌మ‌స్య‌ల‌కు మూలం చంద్ర‌బాబే కార‌ణం.. ఇది ఎంత మందికి తెలుసు.. అంటే త‌క్కువే అని చ‌ప్ప‌వ‌చ్చు.. ఇప్పుడు విద్యుత్ స‌మ‌స్య‌లు రావడానికి కార‌ణం ఓవైపు భారీ వ‌ర్షాలు కార‌ణం కాగా, మ‌రోవైపు చంద్రాలు చేసిన అప్పులు,  త‌ప్పిదాలు అని స్ప‌ష్టంగా చెప్ప‌వ‌చ్చు. ఇప్పుడు ఏపీలో విద్యుత్ స‌మ‌స్య రావ‌డానికి బొగ్గు స‌మ‌స్య తీవ్రం కావ‌డం.


ఏపీలో విద్యుత్ ఉత్ప‌త్తికి రోజుకు స‌గ‌టున 75వేల మెట్రిక్ ట‌న్నుల బొగ్గు అవ‌స‌రం. కానీ ప్ర‌స్తుతం రోజుకు వ‌స్తున్న బొగ్గు కేవ‌లం 45వేల మెట్రిక్ ట‌న్నులు. అంటే 30వేల మెట్రిక్ ట‌న్నుల బొగ్గు కొర‌త ఏపీ ఎదుర్కొంటుంది. ఇందుకు ప్ర‌ధాన కార‌ణం సింగ‌రేణీ, ఒడిషా లోని మ‌హాన‌ది బొగ్గు క్షేత్రాల్లో కార్మికుల చేసిన 15రోజుల స‌మ్మేతో ఆగిపోయిన బొగ్గు త‌వ్వ‌కాలు. దీంతో ఏపీకి బొగ్గు స‌ర‌ఫ‌రా ఆగిపోయింది. విద్యుత్ స‌ర‌ఫ‌రా నిలిచిపోతే జ‌నం ఇబ్బందులు ప‌డుతార‌నే ఆలోచ‌న‌తో ఏపీ సీఎం జ‌గ‌న్‌, తెలంగాణ సీఎం కేసీఆర్‌కు చేసిన విజ్ఞ‌ప్తి మేర‌కు సింగ‌రేణి నుంచి  31.5వేల మెట్రిక్ ట‌న్నులు బొగ్గు పంపేందుకు ఒప్పుకున్నారు. అంతే కాదు సింగ‌రేణి కూడా ఒప్పుకుని పంపేందుకు ఏర్పాట్లు చేస్తుంద‌ట‌..


ఇక చంద్రాలు చేసిన మ‌రో తప్పు అప్పు.. ఎన్నిక‌ల ముందు ఓట్ల కోసం ఫీట్లు చేసిన చంద్రాలు విద్యుత్ కంపెనీల నుంచి దాదాపుగా 3.8వేల మిలియ‌న్ యూనిట్ల విద్యుత్‌ను అప్పుగా తీసుకుని విద్యుత్ రూపంలోనే అప్పు చెల్లిస్తామ‌ని మాట ఇచ్చారు. ఇప్పుడు అధికారం పోయింది.. కానీ ఆ అప్పును చెల్లించే బాధ్య‌త ఏపీ జెన్‌కో పై ఉంది. అందుకే రోజుకు 1500 మెగావాట్ల విద్యుత్‌ను అప్పు పేరుతో మ‌ళ్ళిస్తున్నారు. దీనికి తోడు చంద్రాలు అధికారంలో ఉన్న‌ప్పుడు వ్య‌వ‌సాయానికి ఉచిత విద్యుత్ ఇచ్చింది 7గంటలు.. జ‌గ‌న్ స‌ర్కారు ఇస్తుంది 9గంట‌లు.. దీంతో విద్యుత్ కొర‌త‌కు కొంత కార‌ణమైంది.


ఇక దిగువ సీలేరు డొంక‌రాయి కాలువ భారీ వ‌ర్షాల‌కు తెగిపోయింది. దీంతో 400 మెగావాట్ల విద్యుత్ స‌ర‌ఫ‌రా నిలిచిపోయింది. విద్యుత్ కొనుగోలుపై చంద్రాలు లెట‌ర్ ఆఫ్ క్రెడిట్ చూప‌క‌పోవ‌డం, అవ‌స‌ర‌మైన మొత్తాన్ని బ్యాంక్‌లో డిపాజిట్ చేయ‌క‌పోవ‌డంతో ఇప్పుడు విద్యుత్ స‌మ‌స్య కు మరో కార‌ణం. అయితే జ‌గ‌న్ స‌ర్కారు వెంట‌నే రూ.570కోట్లు చెల్లించ‌డంతో స‌మ‌స్య‌ను కొంత మేర‌కు త‌గ్గించే అవ‌కాశం క‌లిగింది.  ఒప్పందాల ఆధారంగా కేంద్ర ప్రభుత్వానికి కూడా ఏపీ సీఎం లేఖ రాశారు.


ఒప్పందం ప్రకారం సరిపడా బొగ్గును సరఫరా చేయాలని… అలా కానీ పక్షంలో ప్రత్యామ్నాయం చూడాలని కేంద్ర బొగ్గు శాఖకు జగన్‌ మోహన్ రెడ్డి లేఖ రాశారు. ఇలా ఏపీ మాజీ సీఎం చంద్రాలు కు రాజ‌కీయ అనుభ‌వం ఎక్కువ‌.. ప‌రిపాల‌న అనుభ‌వంకు కొద‌వు లేదు.. కాని ప్ర‌జ‌ల‌ను, ఏపీని విద్యుత్ స‌మ‌స్య‌నుంచి గ‌ట్టెంచ‌డంలో పూర్తిగా విఫ‌లం చెంది, ఆ నేపం ఇప్పుడు జ‌గ‌న్ స‌ర్కారుపై నెట్టేశాడు.. పాపం చంద్రాలుది.. శాపాలు జ‌గ‌న్‌కు.. 



మరింత సమాచారం తెలుసుకోండి: