ఈఎస్ఐ స్కామ్ నిందితులు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు వారం రోజుల కస్టడీ కోరుతూ ఏసీబీ పిటిషన్ దాఖలు చేసింది. నిందితుల తరపు న్యాయవాది బెయిల్ మంజూరు చేయాలని కోరుతున్నారు. మరికాసేపట్లో ఈ బెయిల్ పిటిషన్ పై విచారణ జరగబోతుంది. ఈఎస్ఐ స్కామ్ లో రోజు రోజుకు కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ స్కామ్ లో ప్రధాన నిందితురాలిగా ఉన్న దేవికారాణి చుట్టూ ఈ స్కామ్ ఉచ్చు బిగుస్తూనే ఉంది. 
 
దేవికారాణి ఇచ్చిన సమాచారంతో ఏసీబీ కొన్ని ఫార్మా కంపెనీలపై కూడా దాడులు చేసిందని సమాచారం అందుతోంది. వారిలో కొంతమందిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఈఎస్ఐ స్కామ్ భారీ స్థాయిలో ఉందని ఈ స్కామ్ వెనక వందల కోట్ల రూపాయల అవినీతి ఉందని అందువలన విచారణకు తగినంత సమయం కావాలని ఏసీబీ కోర్టుకు వాదనలు వినిపించే అవకాశం ఉందని సమాచారం. 
 
ఈ కేసు వెనక ఒక మాజీ ఐఏఎస్ అధికారి హస్తం కూడా ఉందని తెలుస్తోంది. ఈఎస్ఐ స్కామ్ లో నిందితులను రిమాండ్ కు పంపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. దేవికారాణి తో పాటు ఏడు మందిని ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకోగా మరికొంతమందిని అరెస్ట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయని తెలుస్తోంది. దేవికారాణి ఇంట్లో వందల కోట్ల రూపాయల ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు బయట పడ్డాయని తెలుస్తోంది. 
 
ఈఎస్ఐ స్కామ్ విషయంలో దేవికారాణి కుట్రపూరితంగా తనను ఈ కేసులోకి లాగుతున్నారని బెయిల్ పిటిషన్ లో పేర్కొందని తెలుస్తుంది. 23 మంది ఇళ్లలో సోదాల్లో సేకరించిన డాక్యుమెంట్ల ఆధారంగా పోలీసులు కూపీ లాగుతున్నారని తెలుస్తుంది. సాధారణంగా లక్షల్లో ఉన్న బిల్లు మంజూరు కావాలంటే ఉన్నతాధికారుల నుండి కిందిస్థాయి అధికారుల వరకు సంతకాలు చేయాలి. కానీ పై స్థాయి అధికారులే అక్రమాలు చేయటంతో కిందిస్థాయి అధికారులు అక్రమాలకు సహకరించారని సమాచారం. 
 



మరింత సమాచారం తెలుసుకోండి: