అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తోంది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో దశలవారీగా మద్యపాన నిషేధానికి సంబంధించిన పనులు గత నెలలోనే మొదలయ్యాయి. ముందు ఎన్నికల సమయంలో ఈ హామీ చేసినప్పుడు ఇది జరిగే పని కాదని తీసిపారేసిన వాళ్లంతా ఇప్పుడు జగన్ తీసుకున్న నిర్ణయానికి నోర్లు వెల్లబెడుతున్నారు. రేపటి నుంచి 3500 మందు షాపులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకోనుంది. ఈనెల మొదట్లోనే 475 షాపులను ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ తన ఆధీనంలోకి తీసుకున్న విషయం తెలిసిందే.

డిప్యూటీ ముఖ్యమంత్రి మరియు ఎక్సైజ్ మినిస్టర్ అయిన నారాయణస్వామి దాదాపు 3,448 షాపులను లీజుకు తీసుకున్నట్లు తెలిపారు. 3,500 మంది సూపర్వైజర్లు మరియు 8033 మంది సేల్స్ మెన్ పనిచేసే ఈ షాపులు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంటాయి. అలాగే ప్రతి ఒక్క షాపులో సీసీటీవీ కెమెరాలు అమర్చి మరియు షాపు ప్రాంగణంలో ఒక పోలీస్ ఆఫీసర్ ని నియమించినట్లు ఆయన తెలిపారు. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ లో దాదాపు 43,000 బెల్ట్ షాపులు అక్రమంగా నడిపారని అవన్నీ జగన్ ప్రభుత్వం మూసివేసి అక్రమ లైసెన్స్ తీసుకున్న వారిపై 2872 కేసులు రిజిస్టర్ చేసినట్లు తెలిపారు.  అలా అక్రమంగా షాపులు నడిపిన వారి సంఖ్య 2928 కాగా వారందరిని కూడా కస్టడీలోకి తీసుకున్నారు.

ఇక పోతే మన మందు బాబులు ఎప్పటిలాగా షాపుల పక్కన కూర్చొని మద్యం సేవించేందుకు వీలులేదు. ఇక పై ఖచ్చితంగా మందు బాటిల్ కొనుక్కొని ఇంటికి వెళ్లాల్సిందే. బహిరంగ ప్రదేశాలలో కూడా మద్యం సేవించడం చట్టరీత్యా నేరం కావడంతో మద్యపాన నిషేధానికి తొలిఅడుగు ఇక్కడి నుంచే మొదలు కానుంది. అంతేకాకుండా అంతకుముందు లాగా అన్ లిమిటెడ్ మందు ఇకపై దొరక్కపోవచ్చు. ప్రతి ఒక్క మనిషికి నిర్దిష్ట మోతాదులోనే మందు విక్రయించనున్నారని సమాచారం. దీంతో రాష్ట్రంలోని మహిళలు హర్షం వ్యక్తం చేస్తుండగా మందు బాబులు మాత్రం ఈ కొత్త చట్టం తో కన్నీరు కారుస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: