చరిత్రను అందరూ చదువుకుంటారు. కొందరు మాత్రమే స్రుష్టిస్తారు. అదేదో సినిమాలో డైలాగులా చెరిపేస్తే చెరిగిపోయేది కాదు చరిత్ర. అలా చరిత్రపురుషులుగా మిగిలిపోయిన వారిలో ఏపీలో ఓ టంగుటూరి ప్రకాశం, ఓ ఎన్టీయార్, ఓ వైఎస్సార్ ఉంటే తరువాత వైఎస్ జగన్ ఆ కోవలోకి వస్తారు. మిగిలిన వారు ఏపీని బ్రహ్మాండంగా  పాలిచవచ్చు. కానీ విప్లవాత్మకమైన మార్పులతో సరికొత్త దశను, దిశను చూపించిన వారే చరిత్ర‌ స్రుష్టించిన వారుగా ఉంటారు. ఎన్టీయార్ పేరు చెప్పగానే మండలాల వ్యవస్థ గుర్తుకువస్తుంది.


అలాగే వైఎస్సార్ పేరు చెప్పగానే ఆరోగ్యశ్రీ, ఫీజ్ రీ అంబర్స్ మెంట్  వంటివి గుర్తుకువస్తాయి. ఇకజగన్ పేరు చెప్పగానే గ్రామ సచివాలయాలు ఠక్కున గుర్తుకు రావల్సిందే. జగన్ ఈ కార్యక్రమం చేపట్టడం వెనక ఎంతటి మేధోమధనం ఉందో తెలియదు కానీ ఇపుడు దేశానికి ఆదర్శవంతమైన పాలనకు గ్రామ సచివాలయాలు ఒక స్పూర్తిగా ఉంటాయని మాత్రం చెప్పకతప్పదు. గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు అన్న మహాత్ముని మాటలను అక్షర సత్యం చేస్తూ ప్రతి రెండు వేల కుటుంబాలకు గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేయడం ద్వారా జగన్ అటు రెవిన్యూ, ఇటు మునిసిపాలిటీల పాలనను ప్రతి గడపకు ఇంకా చేరువ చేశారు. 


 ఈ విషయంలో జగన్ ఆలోచనా తీరు అద్భుతమని అంతా అంటున్నారు. రెండు వేల జనభా  ఆవసరాలను  తీర్చే ఓ ప్రభుత్వం పక్కనే ఉండడం అంటే చాలా వరకూ సమస్యలు తీరుతాయని చెప్పాల్సిందే.  అదే విధంగా మరో వైపు నాలుగు నెలల పాలనలోనే జగన్  నాలుగు లక్షల ఉద్యోగాల కల్పన కూడ కూడా మరింత గొప్ప విషయం. ఈ విధంగా చేయడం ఓ రికార్డుగా చెబుతున్నారు. బయటకు విమర్శలు చేస్తున్నా టీడీపీ నేతలు సైతం జగన్ తీసుకుంటున్న నిర్ణయాల పట్ల మెచ్చుకుంటున్నారని అంటున్నారు.


 జగన్ కి వచ్చిన ఈ తరహా ఆలోచనలు మనకు ఎందుకు రాలేదని వారు అనుకుటున్నారంటేనే ఇది గొప్ప కార్యక్రమం అని అర్ధమవుతోంది. మొత్తానికి జగన్ చరిత్రలో నిలిచే పనులు కేవలం నాలుగు నెలల్లోనే చేయడం విశేషమైతే మిగిలిన పాలనలో మరెన్ని కార్యక్రమాలు చేపడతారో చూడాలని అంతా ఆసక్తిని కనబరుస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: