రైతులకు సాగు సమయంలో ఎదురయ్యే ఆర్ధిక సమస్యలలో అండగా ఉండడానికి, వారు తగిన సమయంలో నాణ్యమైన ఉత్పాదకాలు, సేవలను పొందడానికి తద్వారా పంటల ఉత్పాదకతను పెంచాలన్న దృక్పథంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము రైతులకు ఆర్థిక చేయూత అందించడానికి అక్టోబర్ 15, 2019 న వైయస్ఆర్ రైతు భరోసా పధకాన్ని అమలు చేయబోతున్నది. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో ఉన్న అర్హులైన ప్రతి రైతు కుటుంబానికి మరియు అర్హులైన కౌలు రైతు/ సాగుదారు కుటుంబానికి సంవత్సరానికి రూ. 12500/- చొప్పున ఆర్ధిక సహాయం ఇవ్వనున్నారు.  వెబ్ ల్యాండ్ సమాచారం ఆధారంగా అర్హులైన భూ యజమాని కుటుంబాలను వై యస్ ఆర్ రైతు భరోసా పథకంలో లబ్ధిదారులుగా గుర్తించడం జరుగుతుంది. అదేవిధంగా  రాష్ట్రంలో భూమి లేని షెడ్యూల్ తెగలు, షెడ్యూల్ కులము,  వెనకబడిన కులము మరియు    మైనారిటీ వర్గాలకు చెందిన కౌలు రైతు కుటుంబాలకు సంవత్సరానికి రూ.12 ,500 లు చొప్పున ఆర్ధిక సహాయం అందించడానికి అవసరమైన బడ్జెట్ ని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. 



వైయస్ఆర్ రైతు భరోసాలో భూ యజమానులుగా ఉన్నపటికీ ఈ కింద పేర్కొనబడిన ఉన్నత ఆర్ధిక స్థాయికి చెందిన వారు లబ్ధిని పొందలేరు.
వివిధ సంస్థలకు చెందిన వ్యవసాయేతర భూములు. రైతు కుటుంబంలో ఒకరు కాని అంతకంటే ఎక్కువ సభ్యులు., ప్రస్తుత మరియు మాజీ రాజ్యాంగ పదవుల కలవారు. ప్రస్తుత మరియు మాజీ మంత్రులు/రాష్ట్ర మంత్రులు/ లోక్ సభ,  రాజ్య సభ సభ్యులు. రాష్ట్ర శాసనసభ సభ్యులు/ రాష్ట్రశాసనసభమండలి, ప్రస్తుత మరియు మాజీమున్సిపల్ కార్పొరేషన్ మేయర్లు, ప్రెసిడెంట్లు, ప్రస్తుత మరియు మాజీ జిల్లా పంచాయతి ఛైర్ పర్సన్లు. వివిధ శాఖలలో పనిచేయుచున్న/ పదవీ విరమణ పొందిన అధికారులు, మాజీ, ప్రస్తుత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల కార్యాలయ,  సంబంధిత  ఉద్యోగులు, వాటి క్షేత్ర స్థాయి అనుబంధ శాఖలు, కేంద్ర ,  రాష్ట్ర సంబంధిత పియస్ఇలు, సంబంధిత సంస్థలు, ప్రభుత్వ గుర్తింపు పొందిన స్వయం ప్రతిపత్తి సంస్థల ఉద్యోగులు, స్థానిక సంస్థల సాధారణ ఉద్యోగులు, (బహుళ పనులు నిర్వర్తించు సిబ్బంది/నాల్గవ తరగతి సిబ్బంది/ గ్రూప్ డి ఉద్యోగులు మినహాయించి). ఆయా  వర్గాలలో పదవీ విరమణ పొంది నెలవారీ  పెన్షన్ రూ.10,000/- అంతకంటే ఎక్కువ ఉన్నవారు(బహుళ పనులు నిర్వర్తించు సిబ్బంది/నాల్గవ తరగతి సిబ్బంది/ గ్రూప్ డి ఉద్యోగులు మినహాయించి).  ఆదాయపు పన్ను చెల్లించినవారు.



వైద్యులు, ఇంజనీర్లు, లాయర్లు, చార్టెడ్ అకౌంటెంట్లు, ఆర్కిటెక్ట్ లు, వారి వారి వృత్తులను కొనసాగించుటకు రిజిస్టర్ కాబడియుండి వారి వృత్తులను ప్రాక్టీసుగా కొనసాగించేవారు.పంట భూముల నుండిఇళ్ళ స్థలాల గా మారిన భూమిని కలిగియున్నవారు. రెవిన్యూ రికార్డు పరంగా నవీకరణ(అప్డేట్) చేయబడని/చేయబడిన  ఆక్వా రైతుల భూములు(పంట పొలాలు ఆక్వా భూములుగా మారిన యెడల),  ఇతర వ్యవసాయేతర భూములు. క్షేత్ర స్థాయిలో పనిచేయుచున్న రెవెన్యూ మరియు వ్యవసాయ అధికారుల ద్వారా ధృవీకరణ జరపాలి. గత సంవత్సరంలో వాణిజ్య పన్ను/ వృత్తి పన్ను/జి ఎస్ టిలను చెల్లించిన వారు.  లబ్ది పొందలేకపోయినప్పటికీ, వారి భూములు సాగుచేయుచున్న భూమి లేని కౌలు రైతులు/ సాగుదారులు ఈ పథకములో అర్హులుగా గుర్తింపబడతారు. కావునవారిని ఆర్థికముగా ఆదుకునేటందుకు పైన పేర్కొన్న వివధ వర్గాలకు చెందినవారు, వారి  వద్ద సాగు చేస్తున్న సాగుదారులు“పంట సాగుదారు హక్కుల పత్రాలు” గ్రామ సచివాలయాలలో పొందే విధముగా సహకరించాలి. రాష్ట్ర ప్రభుత్వం సాగుదారులకు“పంట సాగుదారు హక్కుల పత్రాలు” గ్రామ సచివాలయాల ద్వారా జారీ చేయుటకు “పంట సాగుదారు హక్కు చట్టం 2019” ని ఆగష్టు 15 వతేది  2019 న అమలు లోనికి తెచ్చింది .



“పంట సాగుదారు హక్కుల పత్రాలు” గ్రామ సచివాలయాల ద్వారా అక్టోబర్ 2వ తేది 2019 నుండి జారీ చేయబడతాయి. ఈ చట్టం  సాగుదారులకు 11 నెలల పాటు పంటపై మాత్రమే హక్కులు కల్పించటం తో పాటు  భూ యజమానుల హక్కులకు పూర్తి భద్రత కల్పిస్తుంది. గ్రామ సచివాలయాల పరిధిలో జరిగే ఈ ఒప్పందంపై ఎటువంటి చట్టపరమైన దావా గాని/ ప్రాసిక్యూషన్ పరమైన చర్యలు గాని తీసుకోవడానికి అవకాశం లేదు. అంతే కాకుండా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కౌలు  చట్టం, 1956 రద్దు ప్రక్రియ జరుగుచున్నది. సాగుదారులు తీసుకునే బ్యాంకు రుణాలను తిరిగి చెల్లించే విషయంలో రికవరీ  చేసే బాధ్యత/హక్కు బ్యాంకుకు  పంట మీదనే గాని భూమి మీద ఉండదు. భూ యజమానులు అందరూ పైన పేర్కొన్న అంశాలను పరిగణలోనికి తీసుకుని వారివద్ద గల సాగుదారులు“పంట సాగుదారు హక్కుల పత్రాలు” పొందే విధముగా అన్నిచర్యలు తీసుకుని వివిధ పథకాల క్రింద రాష్ట్ర ప్రభుత్వమ అందించే సహాయ సహకారాలు సాగుదారులు పొందే విధముగా తోడ్పాటుని  అందించగలరని  వ్యవసాయశాఖ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాము.


మరింత సమాచారం తెలుసుకోండి: