ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ అధికర్మలోకి వచ్చిన తరువాత వరసగా నిర్ణయాలు తీసుకుంది దూసుకుపోతున్నారు.  ఇప్పటికే విషయాల్లో విజయం సాధించారు.  ఉద్యోగాల కల్పనలో జగన్ అందరికంటే ముందున్నారు.  గ్రామవాలంటీర్లుగా రెండున్నర లక్షల మందిని నియమించిన జగన్, ఇప్పుడు గ్రామ  సచివాలయ ఉద్యోగులుగా మరో లక్షా 20వేల మందిని నియమించారు.  ఈ స్థాయిలో నియామకం జరగడం ఇదే మొదటిసారి.  అధికారంలోకి వచ్చిన మూడున్నర నెలల్లోనే ఈ స్థాయిలో  ఉద్యోగాల కల్పన జరిగింది అంటే..  అర్ధం చేసుకోవచ్చు ఏ స్థాయిలో జగన్ దూసుకుపోతున్నారో.  


అయితే, జగన్ పాలన వందరోజులు పూర్తయ్యేవరకు వేచి చూడాలని షరతులు పెట్టిన పవన్ కళ్యాణ్.. జగన్ వందరోజుల పాలనపై సర్వే చేశారు.  ఆ సర్వే ప్రకారం జగన్ పధకాలు బాగున్నా.. అమలులో మాత్రం అవి చురుగ్గా సాగడం లేదని పవన్ పేర్కొన్నాడు. కాగా, ఇప్పుడు పవన్ కళ్యాణ్ జగన్ పై మరో  అస్త్రాన్ని ఎక్కుపెట్టారు.  అదే విద్యుత్ అస్త్రం. ఆంధ్రప్రదేశ్ లో రోజుకు అవసరమైన విధ్యుత్ ఉత్పత్తి జరగడం లేదని విమర్శించారు.  


ఈ ఏడాది వరసగా వర్షాలు కురవడంతో విద్యుత్ వినియోగం తగ్గిపోయింది.  విద్యుత్ ఉత్పత్తి తగ్గిపోయినా.. దానికి తగ్గట్టుగా ఉత్పత్తి జరగడం లేదని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.  దీనిపై పవన్ ట్వీట్ చేశారు.   ఈ ఏడాది వర్షాలు భారీగా ఉన్నాయి. విద్యుత్ డిమాండ్ సహజంగానే తగ్గుతుంది. ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో సగటున రోజుకి  150 మిలియన్ యూనిట్ల డిమాండ్ ఉంటుందని ముందుగానే విద్యుత్ రంగ నిపుణులు అంచనాలు వేశారు. ఆ మేరకు ఉత్పత్తి చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది.

 2019 సెప్టెంబర్ నెలలో విద్యుత్ డిమాండ్ 150 మిలియన్ యూనిట్స్ గా ఉంది. ఈ నెల 29 వ తేదీన థర్మల్, హైడల్, సంప్రదాయేతర ఇంధన ప్రాజెక్టులు నుంచి వచ్చిన విద్యుత్ 55 .315 మిలియన్ యూనిట్లు మాత్రమే ఉంది.  ఆ ఫలితమే రాష్ట్రవ్యాప్తంగా కరెంట్ కోతలు. పల్లెల నుంచి నగరాల వరకూ అన్ని చోట్లా చీకట్లే. ఇది రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇస్తున్న దసరా కానుకగా భావించాలా?   ఏ కొత్త ప్రభుత్వమైనా రాగానే చేసే మొదట పని శుభం తో మొదలుపెడతారు, కొత్త ప్రాజెక్టులు శంకుస్థాపనలు,పెట్టుబడుల మీద ఒప్పందాలు కానీ వైసీపీ ప్రభుత్వం  రాగానే చేసింది ఇళ్లు కూల్చివేతలు , పెట్టుబడుల ఒప్పందాల రద్దులు, భవననిర్మాణ కార్మికులకి పని లేకుండా చెయ్యటం, ఆశ వర్కర్ల ని రోడ్లు మీదకి తీసుకురావటం , కేసులు పెట్టటం, అమరావతి రాజధాని లేకుండా చెయ్యటం... మరి ఇలాంటి ఆలోచనలతో ఉన్నవాళ్ళకి కరెంటు కొరత మీద ఏం దృష్టి ఉంటుంది?  అని పవన్ కళ్యాణ్ ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: