రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో విద్యుత్‌ కోతలు తీవ్రమయ్యాయి. గ్రామీణ ప్రాంతాలో సమస్య మరింత దుర్బరంగా తయారయ్యింది. నాలుగు నుండి ఐదు గంటలపాటు కరెంటు కోతలతో ప్రజలు అల్లాడుతున్నారని అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు.  సహజంగా వర్షాకాలంలో విద్యుత్‌కోతలు ఉండవు. కానీ జగన్మోహన్‌రెడ్డి హయాంలో వర్షాకాలంలో కూడా పల్లెలు, పట్టణాలనే తేడా లేకుండా అన్ని చోట్ల విద్యుత్‌ కోతలు పెడుతున్నారు. 2014 చంద్రబాబు అధికారానికి వచ్చే నాటికి 22.5 మిలియన్‌ యూనిట్ల లోటు వున్నది. కాంగ్రెస్‌, వైఎస్‌ ప్రభుత్వం పెట్టిన విద్యుత్‌ బకాయిలు రూ.10 వేల కోట్లలను చంద్రబాబు ప్రభుత్వం తీర్చిందని అన్నారు. 

 విద్యుత్‌ లోటును 100 రోజుల్లోనే అధిగమించింది. మిగులు విద్యుత్‌ ఉత్పత్తి చేసి ప్రభుత్వాన్ని జగన్‌ చేతిలో పెట్టడమైంది. నాలుగు నెలల్లోనే జగన్‌ రాష్ట్రాన్ని కరెంట్‌ కోతల రాష్ట్రంగా మార్చారు. రూ.4.84 వచ్చే పవన, సౌర విద్యుత్‌ ను నిలుపుదల చేశారు. రూ. 6 పెట్టి కొంటున్నారు. సౌర, పవన విద్యుత్‌ నిలుపుదల చేసినందున ధర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తి వున్న బొగ్గు ఖర్చు చేశారు. సకాలంలో బొగ్గు కొనలేదు. జల విద్యుత్‌ వస్తున్న జగన్‌ స్వార్థం వల్ల రాష్ట్రంలో కరెంటు కోతలు పెడుతున్నారని అయన తెలిపారు. 


తన అసమర్ధతను కప్పిపెట్టుకోవడానికి గత ప్రభుత్వంపై నిరాధార నిందలు వేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కోర్టులు చెప్పిన విధంగా వెంటనే పవన, సౌర విద్యుత్‌ జను తీసుకోవాలి. కరెంటు కోతలు ఎత్తివేయాలి. లేకుంటే విద్యుత్‌ వినియోగదారులు చేసే ఉద్యమాలకు జగన్‌ ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుంది. కరెంటు కోతలతో, దోమకాట్లతో ప్రజలు మలేరియా లాంటి విష జ్వరాలతో హాస్పిటల్‌ పాలౌతున్న ప్రభుత్వం సమస్యను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తుంది తప్పా పరిష్కార చర్యలు చేపట్టడం లేదని ఆరోపించారు.

రాష్ట్రంలో అప్రకటిత విద్యుత్‌ కోతలు లేవని అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెప్పారని అయన పార్కోన్నారు.ఈస్ట్రన్‌ పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీ లిమిటెడ్‌ పరిధిలోని తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలలో సాంయంత్రం 6 నుండి రాత్రి 11 గంటల కరెంటు కోతలతో ప్రజలు నరకయాతన పడుతున్నారు. ముందస్తు సమాచారం లేకుండా పండుగ రోజుల్లో అమలు చేస్తున్న ఈ కోతలతో అనేక మంది తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కర్నూలు, గుంటూరు, అనంతపురం జిల్లాలో ప్రజలు ఆందోళన బాట పట్టారు. అందుబాటులో ఉన్న పవన విద్యుత్‌ను కాక ధర్మల్‌ విద్యుత్‌ పై ఆధారపడటంతో ఈ పరిస్థితి దాపిరించింది. జగన్‌ అవగాహనలేమి వల్ల థర్మల్‌విద్యుత్‌ ప్లాంట్లు సైతం మూతపడే స్థితికి చేరుకున్నాయని అయన ఆరోపించారు. 

ప్రపంచ వ్యాప్తంగా థర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తిని తగ్గించి పర్యవరణహితమైన పునరుత్పాతక విద్యత్‌ ను పెంచుకోవాలని నిపుణులు చెబుతున్నా  కమీషన్ల కోసం జగన్‌ ప్రభుత్వం పవన, సౌర విద్యుత్‌ ను నిలిపివేసింది. చంద్రబాబు గారు 2014 అధికారంలోకి వచ్చీ రాగానే 22.5 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ లోటును అధిగమించి 24 గంటల నిరంతరాయ విద్యుత్‌కి శ్రీకారం చుట్టి మిగులు విద్యుత్‌ను చేతిలో పెడితే జగన్‌ ప్రభుత్వం మాత్రం విద్యుత్‌ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టే ప్రయత్నం చేస్తోంది. జగన్‌ ప్రభుత్వం పవన, సౌర విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలను సమీక్ష పేరతో జూలై 1 న జివో నం 63 విడుదల చేసి రాష్ట్ర విద్యుత్‌ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టింది.

విద్యుత్‌ డిమాండ్‌ లేదని హైకోర్టుకు అబద్దాలు చెప్పిన ప్రభుత్వం కరెంటు కోతలపై ఇప్పుడు ప్రజలు చేస్తున్న ధర్నాలకు ఏం సమాధానం చెబుతుందని అయన డిమాండ్ పేర్కొన్నారు. తెలుగుదేశం ప్రభుత్వ అవినీతే విద్యుత్‌ కోతలకు కారణమని విద్యుత్‌ మంత్రి చెప్పడం వైసీపీ ప్రభుత్వ చేతగానితనానికి నిదర్శనం. ఒకవేళ అవినీతి జరిగితే గత నాలుగు నెలలుగా ఒక్క రూపాయి అవినీతిని కూడా వైసీపీ ప్రభుత్వం ఎందుకు నిరూపించలేకపోయింది? గత ఐదేళ్ళలో ఏనాడు ఒక్క విద్యుత్‌ సంస్థ కూడా తమకు ప్రభుత్వం బకాయిలు చెల్లించడంలేదని కోర్టుకు వెళ్ళిన దాఖలాలు లేవు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లోనే విద్యుత్‌ ఉత్పత్తి సంస్థలు మూతపడేలా చేసి వాళ్ళను కోర్టుల చుట్టూ తిప్పుతున్నారని ఆయన పేర్కొన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: