ఈ కాలంలోని తల్లిదండ్రులకు చిన్నారులను బడికి పంపే వరకు కళ్లలో ఆనందం ఉండదు.చదువుకునే రోజులు పోయి,చదువు కొనే రోజులు వచ్చాయని తెలిసి కూడా, తమ పిల్లల భవిష్యత్తు కోసమని మంచి పేరున్న కార్పొరేట్‌ పాఠశాలల్లో చేర్పిస్తారు.ఇక అక్కడినుండి ప్రారంభం అవుతుంది,ఇటు తల్లిదండ్రులకు ఫీజుల భారం,అటూ పిల్లలకు చదువులతో పాటుగా అధికబరువున్న బ్యాగుల భారం.ఇప్పటి చదువులు చదువుల్లాలేవు అండమాన్ జైల్లలా వున్నాయి.



ఊపిరి పీల్చుకో లేనంతగా,హోంవర్క్‌లు, క్లాస్ వర్క్‌లు అంటూ ఒకటే చాకిరి.ఈ పిల్లలు చదివి పెద్దైయ్యాక ఉద్యోగాలు చేస్తారో లేదో తెలియదు గాని పెద్దపెద్ద మూటలు మోసిన అలసట రానంతంగా ప్రైవేట్ స్కూల్స్ తయారు చేస్తున్నాయి.ఇక ఫీజుల విషయంలో చూపించే శ్రద్ధ చదువుల విషయంలో చూపించడం లేదని కొన్ని కొన్ని పాఠశాలల మీద ఆరోపణలు వున్నాయి. ఇప్పటికే అధికమైన ఫీజుల భారంతో,తల్లిదండ్రులు,చదువుల భారంతో పిల్లలు యంత్రాల్లా తయరయ్యారు.ఈ పరిస్దితిలో తెలిసో తెలియకో చేసిన ఓ ప్రైవేట్ స్కూల్ నిర్వాకం అందర్ని నోరెళ్లబెట్టేలా చేసింది.అదేమంటే నర్సరీ చిన్నారులకు పరీక్షలు పెట్టడం,అందులో ఫస్టుక్లాస్‌లో పాసయ్యిన వారికి గ్రేడ్‌లు ఇవ్వడం జరిగింది.మాటలు కూడ సరిగ్గా రాని పిల్లలకు కూడా పరీక్షలు,గ్రేడ్‌లు ఇదీ మరీ అతికాకపోతే ఏంటండీ,



ఇంతటీ నిర్వాకం జరిగింది హైదరాబాద్‌లోని ప్రియభారతి అనే ఓ ప్రైవేటు పాఠశాలలో,వీరి గొప్పని ఎలా ప్రదర్శించారంటే మా పాఠశాల నర్సరీలో 10 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.వారిలో ఇద్దరికి పదికి పది పాయింట్లు వచ్చాయి.ఇక ఎల్‌కేజీలో 14 మంది,యూకేజీలో 11 మంది ఒకటో తరగతిలో 9 మంది ఫస్ట్ క్లాస్‌లో పాసయ్యారంటూ ఈ పిల్లల ఫోటోలతో సహా ఓ పెద్ద ఫ్లెక్సీ కొట్టించి దాన్ని స్కూల్ ముందు ఏర్పాటు చేసారు,ఇంట్లో అల్లరి చేస్తున్నారని స్కూల్లో పడుకోవడానికి పంపించే పిల్లలకు పరీక్షలు పెట్టి గ్రేడ్స్ ఇవ్వడం ఏంటో అర్ధం కావడంలేదంటూ ఈ బోర్డ్‌ను చూసిన వారు తలలు బాదుకుంటున్నారు.ఇంతకు ఇలా ప్రవర్తించిన ఆ స్కూల్ టీచర్లకు ముందు చదువచ్చో లేదో తెలుసుకోండంటూ కొందరు నెటిజన్స్ విమర్శిస్తున్నారు.ఇక దీనిపై ఇటు పాఠశాల యజమాన్యం కానీ విద్యాశాఖ అధికారులు కానీ ఇప్పటివరకు స్పందించలేదట.

మరింత సమాచారం తెలుసుకోండి: