లిక్కర్ కు ఎందుకు అంతటి డిమాండ్ ఉంటుంది అంటే కిక్ ఇస్తుంది కాబట్టి అన్నారట.  రుచికి చేదుగా ఉన్నా.. కడుపులోకి వెళ్లిన తరువాత అది ఆనందాన్ని ఇస్తుంది.  మత్తును ఇస్తుంది.. తెలియని ధైర్యాన్ని ఇస్తుంది.  ఆ మైకపు ధైర్యంతో ఏం చేస్తున్నారో తెలియకుండా చేస్తుంటారు.  అదే జరిగే తప్పు.  తప్పులు జరగడం వలన ఇబ్బందులు వస్తున్నాయి.  మద్యం తాగడం తప్పు అని తెలిసినా కానీ, మద్యం తాగడం మానెయ్యారు.  ఎంత కష్టమైనా సరే డబ్బులు అప్పు చేసైనా సరే మద్యం కొనుగోలు చేస్తారు.  


అయితే లిక్కర్ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది.  లిక్కర్ ను ప్రభుత్వమే అమ్మాలని నిర్ణయం తీసుకుంది.  ఇందులో భాగంగానే లిక్కర్ అమ్మడం మొదలుపెట్టింది. అక్టోబర్ 1 వ తేదీ నుంచి లిక్కర్ ను ప్రభుత్వం అమ్ముతుంది.  సో, ప్రైవేట్ మద్యానికి ఆంధ్రప్రదేశ్ లో ఇదే ఆఖరు రోజు.  అది రాత్రి 9 గంటల వరకే అనుమతి ఇచ్చింది.  తొమ్మిది తరువాత మందు షాపులను, మందును ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది.  


లిక్కర్ ఎంత స్టాక్ ఉన్నదో అది ప్రభుత్వ పరం అవుతుంది.  అంటే.. ఆ మద్యానికి తిరిగి డబ్బులు చెల్లించరు.  అందుకే ఆంధ్రప్రదేశ్ ఈరోజు ఉదయం నుంచి భారీ డిస్కౌంట్ తో మద్యం అమ్మకాలు జరిపారు.  ఒకటి కొంటె మరొక బాటిల్ ఫ్రీ అని, ప్రీమియర్ లిక్కర్ బాటిల్ పై దాదాపు వెయ్యి రూపాయల వరకు డిస్కౌంట్ అని బోర్డులు దర్శనం ఇచ్చాయి.  ఇలా ఎందుకు అమ్ముతున్నారు అంటే .. తొమ్మిది తరువాత సేల్స్ ఉండదు.  


పైగా ఉన్న స్టాక్ కు డబ్బు ప్రభుత్వం తిరిగి ఇవ్వదు.  దీంతో ఎంత ఉంటె అంత ఎంత వచ్చినా సరే అమ్మేసేందుకు సిద్ధం అయ్యి అమ్మకాలు జరిపారు.  దీంతో మద్యం దుకాణాల ముందు ఉదయం నుంచి భారీ క్యూలు కనిపించాయి.  రేపటి నుంచి మద్యాన్ని ప్రభుత్వం అమ్ముతుంది కాబట్టి షరతులు ఉంటాయి.  మధ్య లిమిటెడ్ గా మాత్రమే అందుబాటులో ఉంటుంది.  బ్లాక్ మార్కెట్ లో మద్యం దొరకదు.  అది అసలు కథ.  అక్కడ సక్సెస్ అయితే, దాన్ని తెలంగాణలో కూడా అమలు చేయాలని ఇక్కడి ప్రజలు పట్టుబడతారేమో.  


మరింత సమాచారం తెలుసుకోండి: