అమెరికాలోనూ నేర సంస్కృతి పెరుగుతోంది. అక్కడి అత్యధికంగా నేరాలు జరిగే నగరాల గురించి అమెరికన్ నేర పరిశోధన సంస్థ ఇటీవల ఓ సర్వే నిర్వహించింది. దీని ప్రకారం అత్యధికంగా నేరాలు జరిగే అమెరికా నగర ప్రాంతాలు ఇవేనట.


డెట్రాయిట్ - మిషిగన్ : ఈ నగరంలో డబ్యు వారెన్ అవెన్యూ/ మెకిన్లే స్టీట్లో ప్రతి పదమూడు మందిలో ఒకరు సగటునహింసాత్మక నేర బాధితులవుతున్నారట. దీని తర్వాత టల్సా - ఓక్లహోమా నగరం సెకండ్ టాప్ లిస్టులో ఉందట. ఇక్కడి ఇ. మొహక్ బుల్ వార్డ్ / ఎన్. సిన్సినాటీ అవెన్యూ హింసాత్మక నేరాలు జరిగే ప్రదేశం. సగటున ప్రతి లక్షమందిలో 1,886 - మంది బాధితులవుతున్నారు.


ఇక ఆ తర్వాత స్థానంలో ఉన్నది.. సెయింట్ లూయిస్ - ఇల్లినోయిస్.. ఇక్కడి సిటీ సెంటర్లోసగటున ప్రతి వెయ్యి మందిలో 80 మంది నేరబాధితులవుతున్నారు. అక్కడ తుపాకులు పేలనిరోజే ఉండదు. బాల్టిమోర్, మేరీలేండ్ లో డ్రూయిడ్ హిల్ అవెన్యూ /వారెన్ స్ట్రీలో 95.5 శాతం మంది పేదరికంవల్ల నేరాలకి పాల్పడుతున్నారట

.మెంఫిస్, టెన్నెసీ : ఇ ఎహ్ క్రంప్ బుల్ వార్డ్/ ఎస్ 4 సీట్లో అద్దె నెలకి 100కి దొరికే ప్రతీప్రాంతంలో హింసాత్మక నేరాలు తప్పవట. ఇలాంటి చోట డ్రగ్ ఎడిక్టులు నివసిస్తూ నేరాలకి పాల్పడుతున్నారట. కేమ్డెన్, న్యూజెర్సీ : ఇక్కడి ఫెర్రీ అవెన్యూ/ ఎస్ 8 స్ట్రీట్లో నివసించే సగటున ప్రతి 11 మందిలో ఒకరు హింసాత్మక నేర బాధితులేనట.


పిట్స్బర్గ్, పెన్సిల్వేనియా : ఇక్కడి చికాగో స్ట్రీట్ / మౌంట్ ప్లెజంట్ రోడ్ లోని ఇళ్ళు ఎక్కువ శాతం ఖాళీగా ఉంటాయి. సగటున మూడింట్లో ఒకటి ఖాళీగా ఉండటంతో బీదవాళ్ళు వాటిల్లో జీవిస్తూ నేరాలకు పాల్పడుతున్నారట. ఇదీ అమెరికాలోని నగరాల్లో నేరాల సంగతి.


మరింత సమాచారం తెలుసుకోండి: