జగన్ మొండి, జగ మొండి. నియంత. ఫ్రాక్షనిస్ట్..సీతయ్య ఎవరి మాట వినడు.. ఇవన్నీ జగన్ కి విపక్షాలు ఇచ్చిన బిరుదులు. నాలుగు నెలల పాలనపై ప్రతిపక్షాలు సంధిస్తున్న విమర్శలు. జగన్ పాలనలో మంచి చెడులు రెండూ ఉన్నాయి. అయితే మంచి ఇపుడున్న రాజకీయానికి అవసరం లేదు. చిన్న  తప్పు జరిగితే దాన్ని పెద్దది చేసి చూపెట్టాలన్న ఆరాటమే కనిపిస్తోంది. ఏపీలో లక్షలాది మందికి అపాయింట్మెంట్ల్ ఇచ్చి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించిన జగన్ని మెచ్చని విపక్షం కరెంట్ కోతల పట్ల మాత్రం ఒక్కసారిగా  విరుచుకుపడిపోతోంది.


ఏపీలో జగన్ చీకటి రాజ్యాన్ని తెచ్చారని, ఆయనది విద్వంస‌ పాలన అంటూ జనసేన అధినేత పవన్ ట్విట్టర్ లో స్పందించారు. జగన్ ది రద్దుల పాలన, కూలగొట్టుడు పాలన, అశుభంతో ప్రభుత్వం పాలన మొదలెట్టిందని ఘాటు కామెంట్స్ పవన్ చేశారు. ఇక విపక్ష నాయకుడు చంద్రబాబు కామెంట్స్ కి హద్దు ఏముంటుంది. ఆయన తన స్టైల్లో రెచ్చిపోయారు.


రివర్స్ సర్కార్ ఇది, అందుకే తాము చేసిన అభివ్రుధ్ధిని అంతా రివర్స్ లో పెడుతోందని నిప్పులు చెరిగారు విద్యుతు కొనుగోళ్ళను సమీక్షించడం  వల్లనే ఇదంతా వచ్చిందని చెప్పి దెప్పిపొడిచారు. జగన్ జగ మొండి, ఆయన వలన ఏపీలో ప్రతీ ఒక్కరూ నానా ఇబ్బందులు పడుతున్నారని చంద్రబాబు ఆక్రోశం వెళ్లగక్కారు. జగన్ విధానాలు ఏపీని చీకట్లోకి నెట్టాయని కూడా అన్నారు.


ఇక సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామక్రిష్ణ సైతం జగన్ని ఏకంగా సీతయ్యతో పోల్చేశారు. జగన్ ఎవరి మాటా వినరని రామక్రిష్ణ హాట్ కామెంట్స్ చేసారు. జగన్ పాలన బాగాలేదనేశారు. ఇసుక కొరత ఉందని, భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారని, అయినా ఈ సర్కార్ కి పట్టడం లేదని, ఎవరు చెప్పినా వినిపించుకునే స్థితిలో లేరని కూడా ఆయన అన్నారు. మొత్తానికి జగన్ని తిట్టడంలో విపక్షాలు పోటీ పడుతున్నాయి. మరి మంచి చెప్పుకోవడం మెప్పు పొందడం ప్రభుత్వం మీదనే ఆధారపడిఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: