అమ్మవారి గుడి వద్ద రక్షణ కల్పిస్తున్నారు ఓ  పోలీస్... దీంతో అటు వైపు వచ్చిన మంత్రి అనుచరులను విధి నిర్వహణలో భాగంగా అడ్డుకున్నారు ఆ పోలీస్.  మమ్మల్నే అడ్డుకుంటావా అంటూ  మంత్రి అనుచరులు  మంత్రికి ఫోన్ చేయగా  మంత్రి పోలీసు అధికారులకు ఫోన్ చేశారు... పోలీస్ ఉన్నతాధికారులు ఆ పోలీస్ కి ఫోన్ చేసి  గట్టిగా మందలించారు. దీంతో తాను తప్పు చేయకుండా ఉన్నతాధికారులను మందలించారు అని చిర్రెత్తి పోయిన పోలీస్ చొక్క  విప్పి నిరసన వ్యక్తం చేశారు. దీంతో అందరూ ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. 

 

 

 

 

 వివరాల్లోకి వెళితే విజయవాడ దుర్గ గుడి టోల్ గేట్  వద్ద రాత్రి పది గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే అక్కడ విధులు నిర్వహిస్తున్న ఓ పోలీసు అధికారి... మంత్రి అనుచరులు కొందరు ఉత్తమ కమిటీ కార్లతో  వస్తుండగా అడ్డుకున్నాడు. దీంతో  పోలీసు అధికారిపై మంత్రి అనుచరుల తమ వాహనాన్నే  అడ్డుకుంటారా అంటూ మంత్రి కి ఫోన్ చేయగా... మంత్రి పోలీస్ అధికారిపై  పోలీస్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసు ఉన్నతాధికారులు సదరు  పోలీస్ ఆఫీసర్ కి కాల్ చేసి మందలించారు. 

 

 

 

 అయితే తాను ఏం తప్పు చేయలేదని అధికారులకు మొరపెట్టుకున్నప్పటికీ ఎక్కువ మాట్లాడితే సస్పెండ్ చేస్తామంటూ బెదిరించారు . దీంతో మనస్తాపానికి గురైన ఆ పోలీస్ ఆఫీసర్ చుక్క విప్పి నిరసన తెలిపారు. కాగా  ఓ పోలీసు అధికారి చొక్కా విప్పి నిరసన తెలపడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. అయితే ఈ ఘటనపై ఉన్నత అధికారులు స్పందించారు. ఆ పోలీస్ ఆఫీసర్ చొక్కా విప్పి నిరసన తెలపలేదని ... అతనికి ఫిట్స్ వచ్చి పడిపోతే ఆస్పత్రికి తీసుకెళ్లామని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: