జగన్మోహన్ రెడ్డి తన పెద్ద మనసును చాటుకున్నారు.  తమ సోదరుడికి ప్రాణబిక్ష పెట్టమని కోరుకుంటున్న  ఇద్దరు చిన్నారుల విజ్ఞప్తికి జగన్ చలించిపోయారు. వెంటనే రూ. 15 లక్షలు మంజూరు చేయాలని సిఎంవో అధికారులను ఆదేశించారు. జగన్ ఔదార్యంతో బాధితుని కుటుంబసభ్యులు, దగ్గర బంధువులు, స్నేహితులు హ్యాపీగా ఫీలవుతున్నారు.

 

ఇంతకీ విషయం ఏమిటంటే శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు జగన్ తిరుమలకు వస్తున్న విషయం ఇద్దరు  చిన్నారులు తెలుసుకున్నారు. వాళ్ళ సొంతూరైన చంద్రగిరి నుండి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. విమనాశ్రయం లాంజిలో జగన్ కు కనబడేట్లుగా చిన్నారులతో పాటు తల్లి, దండ్రులు కూడా ప్ల కార్డులు పట్టుకుని నిలబడ్డారు.

 

వాళ్ళని చూడగానే జగన్ స్వయంగా వాళ్ళ దగ్గరకు వెళ్ళారు. వాళ్ళ చెప్పిన విషయం ఏమిటంటే 10వ తరగతి చదువుతున్న  వాళ్ళ సోదరుడు హరికృష్ణ 2015లో ఓ స్కూలు భవనంపై నుండి సిబ్బంది క్రిందకు తోసేశారు. వెంటనే ఆసుపత్రిలో చేర్పించినా కోమాలోకి వెళ్ళిపోయాడని వైద్యులు చెప్పారు.

 

చెన్నై ఆసుపత్రిలో తొమ్మిది ఆపరేషన్లు చేసినా ఉపమోగం కనబడలేదు. దాదాపు మూడు సంవత్సరాల పాటు కోమాలోనే ఉన్న హరికృష్ణ ఈ మధ్యనే స్పృహలోకి వచ్చాడు. అయితే మంచానికే అతుక్కుపోయాడు. హరికృష్ణ మామూలుగా లేచి నిలబడాలంటే మరో శస్త్రచికిత్స చేయాలని అందుకు 10 లక్షల రూపాయలవుతుందని డాక్టర్లు చెప్పారట. దాంతో అంత స్తోమత లేని కుటుంబసభ్యులు జగన్ సాయాన్ని అర్ధించారు.

 

ఎయిర్ పోర్టులో వీళ్ళతో మాట్లాడి సమస్యను విన్న వెంటనే జగన్ హరికృష్ణ శస్త్రచికిత్స కోసం రూ. 10 లక్షలు మంజూరు చేయాలంటూ ఆదేశించారు. అలాగే చిన్నారుల చదువుల కోసం మరో రూ. 5 లక్షలు కూడా మంజూరు చేశారు.  ఎప్పుడైతే తమ బాధను విన్న జగన్ వెంటనే స్పందించారని తెలిసిందో హరికృష్ణ కుటుంబ సభ్యులకు ఆనందంతో కన్నీళ్ళు ఆగలేదు. మొన్నటికి మొన్న విశాఖపట్నంలో కూడా ఓ క్యాన్సర్ బాధితుడి ఆపరేషన్ కోసం జగన్  రూ. 25 లక్షలు మంజూరు చేసిన విషయం గుర్తుండే ఉంటుంది.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: