ఇన్నాళ్లు కనబడని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సడెన్‌గా ఇప్పుడు మీడియా ముందు ప్రత్యక్షమైయ్యాడు.అతను మీడియా ముందుకు రావడంతోనే జగన్‌ను టార్గెట్ చేసి హెచ్చరికలు చేసారు.గతంలో ఏపీ ఎన్నిక‌ల్లో రాష్ట్ర చరిత్రలో 50శాతం ఓట్లు సాధించిన ఏకైక పార్టీ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మాత్రమేనని,వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రజల అభిమానాన్ని సంపాదించారని,నిజంగా అవినీతి లేకుండా పాల‌న అందిస్తే 30 ఏళ్ల‌పాటు జ‌గ‌న్ సీఎంగా ఉంటార‌ని పొగిడిన నోరుతోనే,అదమరిస్తే అంతే అని,మీకు ఎలక్షన్స్‌లో 151 సీట్లు వచ్చాయని..దానిని శాశ్వతంగా భావించవద్దని స్పష్టం చేస్తున్నారు ఉండవల్లి..



,అంతేకాకుండా నవరత్నాల్లో ఏ మాత్రం తేడా వచ్చిన సొంత వారే తిరగబడతారని వ్యాఖ్యానించారు.ఇక ఏపీ చరిత్రలో ఎప్పుడు అత్యధిక మెజార్టీతో ఎవరు అధికారంలోకి వచ్చినా తిరుగుబాట్లు తప్పలేదని ఎన్టీఆర్ మీద చంద్రబాబు తిరుగుబాటు చేస్తారని ఎవరైనా ఊహించార అని ఉండవల్లి ప్రశ్నించారు.ఇక ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు చేపట్టి ఇంకా ఆరు నెలలు కూడా పూర్తి కాలేదని..అయినా పాలన,వ్యతిరేక కామెంట్లు చేసే స్థాయిలో లేదని.అదే సమయంలో రాష్ట్రంలో చంద్రబాబు హాయంలో విద్యుత్ కోతలు లేవని..ఇప్పుడు జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత అమలవుతున్న విద్యుత్ కోతల మీద ప్రజల్లో వ్యతిరేకత ఉందని చెప్పారు.



దీనికి గత పాలకుల వైఫల్యాలు కారణమని చెప్పినా ప్రజలు అంగీకరించరన్నారు.ఈ సమస్యను తొందరగా పరిష్కరించాలని,అదే విధంగా ఇసుక కొరత కారణంగా అనేక మంది కూలీలు ఉపాధి కోల్పోయారని..దీని మీద వ్యతిరేక కనిపిస్తోందని చెప్పుకొచ్చారు.గతంలో వైయస్ సైతం భూ సంస్కరణల దిశగా తన భూములు ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేస్తే..ఆయన పైన ప్రతిపక్షాలు విరుచుకుపడి,ఆయన మీదే కేసులు పెట్టాలని డిమాండ్ చేసాయని.అందుకే జగన్ ఇటువంటివన్నీ గుర్తు పెట్టుకొని ముందుకు వెళ్తే భవిష్యత్ ఉంటుందని ఉండవల్లి హితబోధ చేసారు.



పోలవరం రివర్స్ టెండర్లలో ఇన్ని కోట్లు తగ్గుతాయని ఊహించలేదు,కాని.విద్యుత్ కోతలు ఎక్కువైతే ప్రభుత్వానికే చెడ్డపేరు వస్తుందని సూచించారు.ఇకపోతే పాక్ ఆక్రమిత కశ్మీర్ మనదేనని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెబుతున్నారని..అసలు పాకిస్థాన్ కూడా మనదేనని,ఆర్టికల్ 370ని రద్దు చేయడంలో తప్పు లేదని,బీజేపీ పుట్టిందే ఈ సిద్ధాంతంమీద అని అన్నారు.ప్రపంచ వ్యాప్తంగా మహాత్మాగాంధీ 150వ జయంతి ఉత్సవాలను నిర్వహించుకుంటున్నవేళ..కేంద్ర ప్రభుత్వం కశ్మీర్ లో కర్ఫ్యూను కొనసాగిస్తోందని విమర్శించారు.ఉగ్రవాద సమస్యకు ఇప్పుడున్న పరిస్థితి పరిష్కారం కాబోదని చెప్పారు...

మరింత సమాచారం తెలుసుకోండి: