ప్రజల నెత్తిమీద వరుసగా పిడుగులు పడుతూ,అతలాకుతలం చేస్తున్నాయి.ఏ వార్త ఎప్పుడు వినవలసి వస్తుందో చెప్పలేని పరిస్ధితి.ఎందుకంటే ఒకటో తారీఖు వచ్చిందంటే వామ్మో అని జడుసుకునే రోజులు వచ్చాయి.ఒకవైపు బ్యాంకుల చార్జీల బాదుడు..మరోవైపు నిత్యావసరాల ధరల పెరుగుదలతో మధ్యతరగతి ప్రజలు విలవిలలాడుతున్నారు. ఇప్పటికే ఉల్లి, టమోటా, బంగాళాదుంప ధరలు పెరిగాయి.వీటికి తోడు ఇప్పుడు వంట గ్యాస్ ధర కూడా తానేం తక్కువ కాదన్నట్లుగా కొండెక్కుతుంది...



ఇక ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు గ్యాస్ సిలిండర్ ధరను ప్రతి నెల ఆరంభంలోనే సవరిస్తూ ఉంటాయి.తాజగా నాన్ సబ్సిడీ 14.2 కేజీల ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరను తాజాగా రూ.15 మేర పెంచింది..గ్యాస్ సిలిండర్ ధర పెరుగుతూరావడం ఇది వరుస గా రెండోనెల కావడం గమనార్హం.ఇకపోతే గ్యాస్ సిలిండర్ ధర జూలై నెలలో రూ.100,ఆగస్ట్ నెలలో రూ.62 మేర దిగొచ్చింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఎల్‌పీజీ ధరలు దిగిరావడం ఇందుకు కారణం.తర్వాత సెప్టెంబర్‌లో గ్యాస్ సిలిండర్ ధర రూ.16 పైకి కదిలింది.ఇప్పుడు మళ్లీ రూ.15 పెరిగింది.ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఒక కుటుంబానికి ఏడాదికి 12 సిలిండర్లను సబ్సిడీ కింద అందిస్తోంది.అదనంగా సిలిండర్ కావాలంటే మాత్రం మార్కెట్ ధర చెల్లించాలి...



ఇక గ్యాస్ కంపెనీలు ప్రతినెలా ఎల్‌పీజీ సిలిండర్ రేట్లను సమీక్షిస్తూ ఉంటాయి.సంస్థలు అంతర్జాతీయ మార్కెట్‌లో ఎల్‌పీజీ రేట్లు,అమెరికా డాలర్-ఇండియన్ రూపాయి మారకపు విలువ వంటి అంశాలు ప్రాతిపదికన ధరను మారుస్తూ ఉంటాయి.ఇక భారత్‌కు ప్రధాన క్రూడ్ సరఫరాదారైన సౌదీ ఆరామ్‌కోపై డ్రోన్ దాడి నేపథ్యంలో దేశానికి ముడి చమురు సరఫరా తగ్గొచ్చనే అంచనాలు నెలకొన్నాయి.అయితే దేశీ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు మాత్రం సరఫరా యథావిథిగా కొనసాగుతుందని, ఎలాంటి అంతరాయం ఉండదని స్పష్టంచేశాయి.ఇక దసరా పండగముందు ధరలపెంపు సామాన్యులకు భరించరాని భారంగా మారింది.దినదినం పేదలబ్రతుకులు ఆనందంగా బ్రతకలేని బడిపంతుల్లా మారుతున్నాయి...

మరింత సమాచారం తెలుసుకోండి: