అతి కిరాతకంగా, అత్యంత అమానుషంగా హత్యగావింపబడి, 7గొడ్డలి పోట్లతో ఘోరాతిఘోరంగా నరికివేయబడిన వైఎస్‌.వివేకానందరెడ్డి, ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డికి బాబాయి అయిన వ్యక్తి హత్యకు కారకులైన వారిని పట్టుకోలేని స్థితిలో, రాష్ట్ర ప్రభుత్వం ఉందని, గౌరవ ముఖ్యమంత్రి ఉన్నారని టీడీపీ రాష్ట్రప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య ఎద్దేవాచేశారు. తనఇంట్లో జరిగిన హత్య విషయంలో ఏం చేయలేని స్థితిలో జగన్‌ ఉండటం పలు అనుమానాలకు తావిస్తోందన్న వర్ల, ఆ హత్య ఎలా జరిగిందో, ఎవరు చేశారో, ఆ ముద్దాయిలు ఎవరో.. జగన్‌కు తెలుసునని స్పష్టంచేశారు. 

ముద్దాయిల ను జగన్‌ ఎందుకు దాస్తున్నారో, వారిని కాపాడాలని ఆయన ఎందుకు ప్రయత్నిస్తున్నారో సమాధానం చెప్పాలని వర్ల డిమాండ్‌చేశారు. రెండురోజుల క్రితం అర్థంతరంగా బదిలీ అయిన కడప ఎస్పీ అభిషేక్‌మహంతి, సీబీసీఐడీ అడిషనల్‌ డైరెక్టర్‌జనరల్‌ అమిత్‌గార్గ్‌ లకు కూడా ముద్దాయిలెవరో తెలుసునన్నారు. అభిషేక్‌ మహంతి కడప ఎస్సీగా వచ్చి మూడునెలలు కూడా కాకుండానే ఎందుకు బదిలీ చేశారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని రామయ్య స్పష్టంచేశారు. వివేకా హత్యకు కారకులైన ముద్దాయిలెవరో అభిషేక్‌మహంతికి, అమిత్‌గార్గ్‌కి తెలుసుకాబట్టే, వారిని ఆఘమేఘాలమీద బదిలీ చేయడం జరిగిందన్నారు. 


సొంతబాబాయిని హత్యచేస్తే ఎవరైనా ఊరుకుంటారా అన్న వర్ల, అధికారం చేపట్టిన వెంటనే జగన్‌ తనబాబాయి హత్యకేసు నిందితులను అరెస్ట్‌ చేయించి, జైలుకు పంపుతారని   భావించానన్నారు. కడుపు చించుకుంటే కాళ్లమీద పడుతుందన్న తీరుగా, జగన్‌ కడుపు చించుకుంటే హత్యవెనకాల ఉన్నవారి బాగోతం బయటి ప్రపంచానికి తెలుస్తుందని రామయ్య కుండబద్ధలు కొట్టారు. దానిలోభాగంగానే కేసులో పురోగతి లేకుండా సాగదీస్తు న్నారని, ముద్దాయిలను అరెస్ట్‌ చేయడం లేదని, అధికారులను బదిలీచేయించారని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హత్య జరిగితే,  దానిపై సీబీఐ విచారణ చేపట్టాలని, చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ని, కేంద్రహోం మంత్రిని కలిసి ఫిర్యాదుచేసిన జగన్‌, ముఖ్యమంత్రి అయ్యాక ఏమీపట్టనట్లు ఎందుకు వ్యవహరిస్తున్నాడో ఆయనే సమాధానం చెప్పాలని వర్ల నిలదీశారు. 


ఇవన్నీ చూస్తుంటే హత్య జరిగినప్పుడే   ఆ ముద్దాయిలెవరో జగన్‌కు తెలుసునని, వారిని కాపాడటానికే ఆయన ప్రయత్నిస్తున్నాడని    రామయ్య తెలిపారు. సొంత బాబాయి హత్యకేసు, దిక్కూమొక్కూ లేని వ్యక్తి కేసుగా మారిందని, ఒక అనామకుడి కేసులా మారిందన్న టీడీపీ నేత, వివేకాహత్య కేసుని సీబీఐకి అప్పగించడానికి జగన్‌ ఎందుకు ఆలోచిస్తున్నారో సమాధానం చెప్పాలన్నారు. సీబీఐ పనితీరుగురించి అందరికన్నా జగన్‌కే ఎక్కువ తెలుసున్న వర్ల, 11 కేసుల్లో ముద్దాయిగా ఉన్న ముఖ్యమంత్రి, తనబాబాయి హత్యకేసులో ఆ దిశగా ఎందుకు ఆలోచనచేయడం లేదన్నారు. తనబాబాయిని చంపినవారికి నిజంగా శిక్షపడాలనే చిత్తశుద్ధి జగన్‌కు ఉంటే వెంటనే ఆయన వివేకా హత్యకేసుని సీబీఐకి అప్పగించాలని వర్ల డిమాండ్‌ చేశారు. 


ముద్దాయిలను పట్టుకోవడానికి సిద్ధమైన అధికారులను బదిలీచేయడాన్ని చూస్తుం టే, ముఖ్యమంత్రి పనితీరుని శంకించాల్సి వస్తోందని రామయ్య స్పష్టంచేశారు. వైఎస్‌ వివేకానందరెడ్డి కూతరు సునీత, తన అన్నజగన్‌ ముఖ్యమంత్రి అయ్యాక కేసుగురించి ఎందుకు మాట్లాడటం లేదన్నారు. ఆమె ధోరణి చూస్తే, ఆమెకు కూడా ముద్దాయిలెవరో  తెలిసే ఉండొచ్చని రామయ్య అనుమానం వ్యక్తంచేశారు. రాష్ట్రాధినేతగా జగన్‌ ఈ కేసు విషయంలో వెంటనే చర్యలు తీసుకోవాలని, వివేకా హత్యకేసుని సీబీఐకి అప్పగించాలని, దోషులను శిక్షించాలని రామయ్య డిమాండ్‌చేశారు.   


మరింత సమాచారం తెలుసుకోండి: