సైరా విషయంలో సస్పెన్స్ గా ఉన్న  అదనపు ప్రదర్శనల వ్యవహారంలో చివరికి ఏపీ సర్కార్ ఓకే చెప్పేసింది. సైరా అదనపు ప్రదర్శన‌లను ఈ నెల 2 నుంచి 8వ తేదీ వరకూ వారం రోజుల పాటు వేసుకోవడానికి జగన్ సర్కార్ అనుమతించింది. ఈ విషయంలో ప్రతీ రోజూ రాత్రి ఒంటిగంట నుంచి ఉదయం పది గంటల మధ్య అదనపు షోలు వేసుకోవచ్చునని పేర్కొంటూ జీవోను జారీ చేసింది. దీంతో జగన్ సర్కార్ అనుమతి ఇస్తుందా  లేదా అని ఆసక్తిగా చూసిన మెగా క్యాంప్ కి ఊరటను ఇచ్చే పరిణామంగా  జరిగింది. 


నిజానికి ఈ చిత్రం విషయంలో అదనపు షోల కోసం వైసీపీ సర్కార్ లోని ఓ మంత్రి లాబీయింగ్ చేసినట్లుగా బయటకు వచ్చింది. నిజానికి మెగా ఫ్యామిలీ మీద జగన్ కి ఏ విధమైన వ్యతిరేకత లేకపోయినా పనిగట్టుకుని ఆ ఫ్యామిలీ మెంబర్స్ వివిధ సందర్భాల‌లో జగన్ని కించపరచే విధంగా మాట్లాడినవి ఇపుడు సోషల్ మీడియాలో మళ్ళీ పెట్టడంతో జగన్ సర్కార్ అదనపు షోలకు అనుమతిస్తుందా లేదా  అన్న డౌట్స్ వచ్చేశాయి. 


జగన్ 2012లో అరెస్ట్ అయినపుడు అప్పటికి హీరోగా కొత్తగా ఎంట్రీ ఇచ్చిన రాం చరణ్ చట్టం తన పని ఇన్నాళ్లకు చేసిదంటూ జగన్ కి వ్యతిరేకంగా ట్విట్టర్లో నాడు పోస్ట్ చేసిన దాన్ని ఇపుడు మళ్ళీ సోషల్ మీడియాలో ఎవరో  పెట్టారు.  అదే విధంగా పవన్ కళ్యాణ్ ప్రతీ రోజూ జగన్ని టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తూనే ఉన్నారు. అసలు పవన్ కళ్యాణ్ 2014 నుంచి జగన్నే టార్గెట్ చేస్తూ వచ్చారు
మరో వైపు మెగాస్టార్ తో జగన్ కి వ్యక్తిగతంగా ఏమీ లేకపోయినా ఆయన ప్రజారాజ్యం టైంలో కానీ ఆ తరువాత కాంగ్రెస్ మంత్రిగా కానీ జగన్ని టార్గెట్ చేసుకుని చాలా విమర్శలు చేశారు.


ఇపుడు ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అయినా సరే జగన్ ఆయన్ని పెద్ద మనసు చేసుకుని తన ప్రమాణ స్వీకారానికి రమ్మని పిలిచినా రాలేదు. ఇలా మెగా క్యాంప్ జగన్ కి దూరంగా ఉండడమే కాదు. వ్యతిరేకంగా ఉందన్న భావన ఒకటి ఏర్పడింది. ఈ నేపధ్యంలో సైరా చిత్ర నిర్మాతగా రాం చరణ్ అదనపు షోల కోసం కనీసం జగన్ని నేరుగా సంప్రదించకుండా ఒకనాటి ప్రజారాజ్యం ఎమ్మెల్యే ప్రస్తుతం జగన్ క్యాబినెట్లో మంత్రిగా ఉన్న వారి ద్వారా లాబీయింగ్ చేయడం పట్ల కూడా వైసీపీలో కొంత అసంత్రుప్తి ఏర్పడిందని కధనాలు వచ్చాయి. 


తనను టార్గెట్ చేస్తున్న మెగా కుటుంబం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన  సైరా చిత్రం విషయంలో సర్కార్ పెద్దగా తాను చేయాల్సిన ధర్మాన్ని అన్నీ మరచి జగన్ చేశారని సర్వత్రా ఇపుడు ప్రశంసలు కురుస్తున్నాయి. పాత విషయాలు జగన్ మరచిపోబట్టే ఏపీలో పండుగ రోజుల్లో వారం రోజుల పాటు అదనపు షోల ద్వారా సైరా కు కోట్ల రూపాయలు ఆదాయం వచ్చేలా సానుకూల నిర్ణయం  తీసుకున్నారని అంటున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: