తాజాగా సిబిఐ వాదన చూస్తుంటే అలాంటి అనుమానమే వస్తోంది. ముఖ్యమంత్రిగా ఉన్నా సరే జగన్మోహన్ రెడ్డి కేసుల విచారణలో కోర్టుకు హాజరు కావాల్సిందే అంటూ ఓ అఫిడవిట్ ఫైల్ చేయటమే విచిత్రంగా ఉంది. సిఎం హోదాలో సాక్ష్యులను ప్రలోభాలకు, ఒత్తిడి గురిచేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సిబిఐ ఆందోళన వ్యక్తం చేయటం విచిత్రంగా ఉంది.

 

జగన్మోహన్ రెడ్డిపై అనేక కేసులు సిబిఐ కోర్టులో విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. ప్రతిపక్షంలో ఉన్నంత వరకూ కేసుల విచారణకు వ్యక్తిగతంగా హాజరైన సంగతి అందరికీ తెలిసిందే. పాదయాత్ర సందర్భంగా వ్యక్తిగత మినహాయింపు కోరుతు జగన్ చేసిన విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించింది. అందుకనే పాదయాత్రలో ఎక్కడ ఉన్నా  ప్రతి శుక్రవారం హైదరాబాద్ కు వచ్చి కోర్టులో హాజరయ్యేవారు.

 

సరే మొన్నటి ఎన్నికల్లో వైసిపికి అఖండ మెజారిటి దక్కటంతో జగన్ సిఎం అయ్యారు. కాబట్టి కేసుల విచారణకు సంబంధించి వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు కోరుతు లేఖ రాశారు. ఆ లేఖనే తాజాగా సిబిఐ వ్యతిరేకిస్తోంది. సిఎం హోదాలో సాక్ష్యులను బెదిరింపులకు గురిచేయటం, ప్రలోభాలకు గురిచేసే అవకాశం ఉంది కాబట్టి వ్యక్తిగత మినహాయింపును వ్యతిరేకిస్తుండటమే ఆశ్చర్యంగా ఉంది.

 

నిజంగానే సాక్ష్యులను బెదిరించటమో లేకపోతే ప్రలోభాలకు గురిచేయాలని జగన్ అనుకుంటే విచారణకు హాజరవుతు కూడా ఆ పనిచేయచ్చన్న విషయాన్ని సిబిఐ మరచిపోయింది. సిఎం అయిన తర్వాత కూడా జగన్ ను కోర్టుకు రప్పించాలన్న సిబిఐ పట్టుదల వెనుక రాజకీయ కారణాలే కనిపిస్తున్నాయి.

 

తెరవెనుక జరుగుతున్న ఎవరో చేస్తున్న రాజకీయం వల్లే సిబిఐ జగన్ విషయంలో ఇంత వ్యతిరేక భావనతో ఉండనే అనుమానాలు పెరుగుతున్నాయి. సిఎం హోదాలో కోర్టుకు హాజరైతే  జగన్ పై  రాజకీయంగా బురదచల్లటానికి చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ , బిజెపి, వామపక్షాల నేతలు రెడీగా ఉంటారనే విషయాన్ని ఎవరైనా ఊహిస్తారు. బహుశా ఇటువంటి వాళ్ళకి వత్తాసుగానే సిబిఐ కూడా జగన్ ఆలోచనను వ్యతిరేకిస్తున్నట్లే కనిపిస్తోంది.

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: