మహాత్మాగాంధీ.. అసలు ఇలాంటి మనిషి ఈ భూమి మీద బతికాడా అని ముందు తరాలు ఆశ్చర్యపోతాయంటూ ఐన్ స్టీన్ వంటి శాస్త్రవేత్తగా గాంధీ గురించి చెబుతారు. మరి ఓ సామాన్య లాయర్ మహాత్ముడుగా ఎలా మారాడు.. ప్రపంచానికే ఆదర్శం ఎలా అయ్యాడు. అందుకు కారణం ఎవరు.. ఆ ప్రస్తానానికి బీజాలు ఎక్కడ పడ్డాయి.


ఈ ప్రశ్నలకు సమాధానం ఆయన తల్లి పుత్లీబాయి అని చెప్పకతప్పదు.. మొక్కై వంగనిది మానై వంగుతుందా అని సామెత. అలాగే చిన్న తనంలోనే పుత్లీబాయి.. చెప్పిన కథలు, గాధలు, పురాణాలు గాంధీ మహాత్ముడిగా మారేందుకు దోహదపడ్డాయి. ఆమె బాల్యంలో చెప్పిన రాజా హరిశ్చంద్ర, శ్రవణకుమారుడి కథలు మహాత్మ గాంధీని ఎంతో ప్రభావితం చేశాయి.


ఆయన ఏం చెప్పారంటే.. 'రాజా హరిశ్చంద్ర కథలు ఎప్పుడూ నన్ను వెంటాడేవి. నేనుప్రతిక్షణం హరిశ్చంద్రుడిలా ఊహించుకునేవాడిని.. ఉండాలనుకునే వాడిని...' అని గాంధీజీ తన ఆత్మకథలో పేర్కొన్నారు. గాంధీని తల్లి ఎంతగా ప్రభావితం చేశారంటే.. తల్లికి అబద్దం చెప్పకూడదని మాంసం తినడం మానేశారు.


మహాత్ముడు పాటించిన సత్యం, ప్రేమ పంటి అంశాలు భారత స్వతంత్రోద్యమం పై ఎంతోప్రభావం చూపాయి. అహింసా మార్గంలో జాతీయోద్యమం సాగేలా చేశాయి. ప్రతి తల్లి పుత్లీ బాయిలాగే ఏదో ఒక రూపంలో పిల్లలకు విలువలు నేర్పించేందుకు ప్రయత్నించాలి.


ఇప్పటి తల్లులు పిల్లలకు కథలు చెప్పడం మానేశారు. టీవీలు, ఫోన్లకు పిల్లను అలవాటు చేసేశారు. అందువల్ల వారికి నైతిక ప్రవర్తన అలవడం కష్టమే.కానీ గాంధీ తల్లి అలా కాదు. పిల్లకు చిన్న వయస్సులోనే ఏది మంచో, ఏది చెడో తెలియజేయాలి. బాల్యం నుంచే నీతి కథలు చెప్పడం వల్ల ప్రయోజనం ఉంటుంది. వాటి వల్ల పిల్లలు సమాజంలో ఉత్తములుగా ఎదగడానికి ఇవి బీజం చేస్తాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: