తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు దగ్గర గోదావరి నదిలో బోటు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. గత రెండు రోజుల బోటు తీయటానికి ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. బోటు వెలికితీత కొరకు రెండు రోజులు ప్రయత్నాలు చేసినప్పటికీ ఆ ప్రయత్నాలు సఫలం కాలేదు. నిన్న నదిలోకి వేసిన 2వేల మీటర్ల రోప్ తెగడంతో వెయ్యి మీటర్లు ఉన్న రోప్ నీటిలో మునిగిపోయింది. 
 
నిన్న పొడవైన రోప్ ను లంగరుకు కట్టి ఏపీ టూరిజం బోటును దానికి జత చేశారు. బోటుకు రోప్ కు మధ్య ఉన్న లంగరు తెగిపోయింది. ప్రస్తుతం బోటు మునిగిన ప్రదేశం అని భావిస్తున్న చోట రోప్ ను వదులుకుంటూ వచ్చారు. ఈరోజు ధర్మాడి సత్యం బృందం సభ్యులు నదిలోకి లంగర్లను వేసి బోటును వెలికితీయటానికి ప్రయత్నాలు చేస్తున్నారు. బోటు మునిగి ఇప్పటికే 17 రోజులు అయింది. 
 
రాతి బండలకు చుట్టుకోవటం వలన రోప్ తెగిపోయిందని సమాచారం. దాదాపు రెండు లక్షల రూపాయల కంటే ఎక్కువ విలువ గల రోప్ నీటిలో మునిగిపోయిందని తెలుస్తోంది. ఈరోజు కూడా బోటు వెలికితీత పనులు కొనసాగుతూనే ఉన్నాయి. ధర్మాడి సత్యం బృందం బోటు 210 అడుగుల లోతులో ఉండవచ్చని అంచనా వేస్తుంది. బోటు బురదలో కూరుకునిపోయి ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. 
 
బోటు బురదలో కూరుకునిపోయి ఉంటే మాత్రం తీయటం సులభంగా సాధ్యం కాదని తెలుస్తోంది. మునిగిపోయిన బోటు బరువు 35 టన్నులకు పైగా ఉందని తెలుస్తోంది. బోటు బురదలో కూరుకుపోయి ఉంటేమాత్రం ధర్మాడి సత్యం బృందం బురదలోనుండి బోటును బయటికి తీస్తే  బోటును తేలికగానే బయటకు తీయవచ్చని తెలుస్తోంది. ఈరోజు రాత్రిలోపు రాయల్ వశిష్ఠ బోటు గురించి ఏదో ఒక స్పష్టత వచ్చే అవకాశం ఐతే ఉందని తెలుస్తోంది. 




మరింత సమాచారం తెలుసుకోండి: