కేంద్రం పెట్టుకున్న ఆశలపై నీళ్లు జల్లుతున్నాయి జీఎస్టీ వసూళ్లు. ఆదాయం ఆశించినంత స్థాయిలో రావడం లేదు. పైగా వేల కోట్ల ఇన్‌కమ్‌కు కొర్రీ పడుతోంది.  ఈ ఏడాది ఆగస్టులో 98వేల 202 కోట్ల ఆదాయం జీఎస్టీ రూపంలో రాగా... సెప్టెంబరు నెలలో ఇది దారుణంగా పడిపోయింది.  దాదాపు 6వేల కోట్ల రూపాయల ఆదాయానికి గండిపడింది.  


గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్-జీఎస్టీ  వసూళ్లు కేంద్రానికి నిరాశనే మిగిల్చాయి. ఆశించిన ఆదాయం రాకపోగా.. వేల కోట్ల ఆదాయానికి గండిపడింది. ఈ ఏడాది ఆగస్టులో 98 వేల 202 కోట్ల ఆదాయం జీఎస్టీ రూపంలో వచ్చింది. అయితే సెప్టెంబర్ నెలలో ఈ మొత్తం దారుణంగా పడిపోయింది.  91 వేల 916కోట్ల ఆదాయం మాత్రమే వచ్చింది. దాదాపు 6వేల కోట్ల ఆదాయానికి కోత పడింది. గత ఏడాది ఇదే నెలలో వచ్చిన వసూళ్లతో పోల్చుకుంటే 2.67శాతం తక్కువని కేంద్ర ఆర్థిక వర్గాలు ప్రకటించాయి.  జీఎస్టీ ఆదాయం తగ్గడం ఇలా వరుసగా మూడోనెల. అంటే  కొనుగోళ్లు పడుతున్నాయా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.   


ఈ ఏడాది సెప్టెంబర్ లో వసూలైన మొత్తం జీఎస్టీ వసూళ్లు రూ.91 వేల 916కోట్లు కాగా, ఇందులో విభాగాల వారీగా సీజీఎస్టీ  రూ.16 వేల 630 కోట్లు, ఎస్ జీఎస్టీ  రూ.22 వేల 598కోట్లు, ఐజీఎస్టీ  రూ.45 వేల 69 కోట్లు, దిగుమతులపై విధించిన వసూళ్లతో కలిపి సెస్  రూ.7 వేల 620కోట్లుగా ఉందని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కార్పొరేట్ పన్ను తగ్గించడంతోపాటు ఇతర రాయితీలను ప్రకటించడంతో ఒక్కసారిగా దేశీయ మార్కెట్లు లాభాల బాటలోకి వచ్చాయి. దీంతో ఐపీఓపై ఆశలు వదులుకున్న కంపెనీలు కూడా మళ్లీ తిరిగి మార్కెట్ లోకి  వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడుల ఉపసంహరణ రూపంలో లక్షా ఐదు కోట్ల రూపాయలను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: