ఏపీలో శాంతి కరువైంది...ఘోరమైన పరిస్థితులు నెలకొన్నాయని తెలుగు దేశం పార్టీ  పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. బుధవారం నెల్లూరులోని టీడీపీ జిల్లా కార్యాలయంలో రూరల్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో  సోమిరెడ్డితో పాటుగా జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర, అబ్దుల్ అజీజ్, ముంగమూరు శ్రీధరక్రిష్ణారెడ్డి, కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, ఆనం వెంకటరమణారెడ్డి, కిలారి వెంకటస్వామి నాయుడు, హరిబాబు యాదవ్, జెన్ని రమణయ్య, ముప్పాళ్ల విజేత, పొత్తూరు శైలజ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా చంద్రమోహన్ రెడ్డి  ప్రభుత్వ పాలనపై రాష్ట్రంలోని సామాన్యుల అభిప్రాయాలను సమావేశంలో వినిపించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రూరల్ నియోజకవర్గ కార్యకర్తలకు పూర్తి అండగా ఉంటామని భరోసా కల్పించారు. 



రాష్ట్రంలో వ్యవస్థ మొత్తాన్ని వైకాపా నాయకుల తమ కబంధ హస్తాల్లోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే అంత తమ  చేతిలో ఉండాలనే ధోరణిలో అధికార పార్టీ పెద్దలున్నారని వ్యాఖ్యానించారు. చివరికి సచివాలయాల పేరుతో ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వ కార్యాలయాలకు కూడా పార్టీ రంగులు వేశారని విమర్శించారు. 90 శాతం ఉద్యోగాలు తమ పార్టీ కార్యకర్తలకే వచ్చాయని ఆ పార్టీ ఎంపీనే ప్రకటిచారంటే నియామకాలు ఎలా జరిగాయో అర్ధమవుతోందని అన్నారు. పక్క రాష్ట్రాలకు తరలించేందుకు ఇసుకను లారీలకు వెంటనే లోడ్ చేసి తరలిస్తుండగా స్థానిక అవసరాలకు మాత్రం ఇవ్వడం లేదన్నారు. తొలిసారిగా పోలీసు, రెవెన్యూ, ఎక్సైజ్ శాఖల మనుగడ ప్రమాదంలో పడిందనిఆందోళన వ్యక్తం చేశారు.




అధికారులను కూడా భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. వైసీపీ నాయకులు కాదని ఉద్యోగాల్లో ఎలా కొనసాగగలమనే అభద్రతాభావంలో అధికారులున్నారు. టీడీపీ కార్యకర్తల ఆస్తులను ధ్వంసం చేయడానికి వందల మంది పోలీసులను కాపాలాగా పెడుతున్నారు...ఇలాంటి పరిస్థితులు ఎన్నడూ చూడలేదన్నారు. ఇంత ఒత్తిడి ఏంటనే ఆందోళనలో అధికారులున్నారు. మెజార్టీ రెవెన్యూ అధికారులు మానసిక క్షోభ అనుభవిస్తున్నారు. పేరుకు మద్యపాన నిషేధమన్నారు..నిషేధం కాదు...వారు చెప్పిన కంపెనీ మందును వారు చెప్పిన రేటుకు తాగే పరిస్థితి తెచ్చారని మండిపడ్డారు. గాంధీ జయంతి సందర్భంగా నైనా ముఖ్యమంత్రి ఆలోచించుకోవాలని సూచించారు.  చిన్నా చితకా కుటుంబాలపై చేస్తున్న దాడులను ఆపాలని తక్షణమే ఆపాలానిసోమిరెడ్డి డిమాండ్ చేశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: