దేశప్రధాని నరేంద్ర మోడీ అంటే లోపల ఏమున్నా బయటకు మాత్రం అందరూ ఎక్కడ లేని ప్రేమను, గౌరవాన్ని ఒలకబోస్తారు. ఓ దేశ ప్రధానికి ముఖ్యమంత్రుల నుంచి ఇంతలా గౌరవం దక్కడం చాలా దశాబ్దాల తరువాత ఇదే తొలిసారి అని చెప్పాలి. ఓ విధంగా కూడా మోడీ రికార్డ్ బ్రేక్ చేశారనుకోవాలి. మోడీ అంటే ఒంటికాలు మీద లేచే కాళికామాతలు కూడా ఆయనతో భేటీలు వేయడం విశేషం కాక మరేమిటి.


మోడీని పశ్చిమ బెంగాల్లో అడుగుపెట్టనివ్వను అంటూ సవాల్ చేసిన మమతాబెనర్జీ  ఈ మధ్యనే మోడీని కలసి చాలాసేపు చర్చలు జరిపారు. అదే విధంగా మోడీ పుట్టిన రోజున ఆయనకు ఇష్ట‌మైన స్వీట్లు, బట్టలు కూడా మోడీకి  ఇచ్చి అన్నయ్యా అంటూ ఆప్యాయతను చాటుకున్నారు. మోడీ సైతం చెల్లెమ్మను చేరదీసి అంతా మాట్లాడారు. ఇక సీన్ కట్ చేసే  ఇపుడు వంతు  తెలంగాణా సీఎం కేసీయార్ ది. ఆయన మోడీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో కూటమి కట్టాలని ఆ మధ్యన ఎన్నికల్లో  తెగ తిరిగారు. ఇక మోడీ రెండవమారు బంపర్ మెజారిటీతో గెలిచిన తరువాత కేసీయార్ ఆయన్ని ఇంతవరకూ కలిసింది లేదు. ఇపుడు హఠాత్తుగా మోడీని ఆయన అపాయింట్మెంట్ తీసుకుని మరీ కలుస్తున్నారు.


రేపు కేసీయర్ ఢిల్లీ వెళ్ళి ప్రధాని మోడీతో ప్రత్యేకంగా భేటీ అవుతున్నారు. ఈ భేటీ సారాంశం ఏంటి అంటే తెలంగాణాకు కావాల్సిన అభివ్రుధ్ధి పనులకు నిధుల కోసం, కాళేశ్వ‌రం ప్రాజెక్ట్ ని జాతీయ ప్రాజెక్ట్ గా చేయాలని డిమాండ్ చేయడం, వివిధ పధకాలకు నిధులను  కోరడం ఇలా అనేక విషయాలయని ముందు పెట్టుకుని మరీ కేసీయార్ ఢిల్లీ టూర్ చేస్తున్నారు. మరో వైపు ఏపీ సీఎం జగన్ సైతం మోడీని కలుస్తున్నారు. ఆయన ఈ నెల 5న ఢిల్లీలో ప్రధానితో భేటీ కాబోతున్నారు. జగన్ ది కూడా అదే విష‌యం. ఏపీకి నిధులు పెద్ద ఎత్తున మంజూరు చేయాలన్నది జగన్ డిమాండ్. ఏపీలో పలు అభివ్రుధ్ధి కార్యక్రమాలకు కేంద్రం సాయం చేయాలని కూడా  జగన్ విన్నవించబోతున్నారు.  


ఇక పనిలో పనిగా ఈ నెల 15న జగన్ ప్రారభించబోతున్న  వైఎస్సార్ రైతు భరోసా పధకానికి ప్రధాని మోడీ చేతుల మీదుగా ప్రారంభించాలనుకుంటున్నరు. దీనికి ఆహ్వానించేందుకు కూడా జగన్ ఢిల్లీ వెళ్తున్నారు. మొత్తానికి ఇద్దరు సీఎం మిత్రులూ ఒకే టైంలో ప్రధానిని కలవడం మాత్రం తెలుగు  రాజకీయాల్లో అసక్తిని పెంచే అంశమే.



మరింత సమాచారం తెలుసుకోండి: