2019 ఎన్నికల్లో కేంద్రంలో మోడీ నేతృత్వంలోని బీజేపీకి పెద్దగా బలం ఉండదని, తప్పనిసరిగా అక్కడి ప్రభుత్వానికి ప్రాంతీయ పార్టీల సహకారం అవసరం అవుతుందని ఆ సమయంలో తప్పనిసరిగా ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం ద్వారా తప్పకుండా అవసరమైన పనులు చేయించుకోవచ్చని ప్రాంతీయ పార్టీలు భావించాయి.  తెలంగాణాలోని తెరాస పార్టీ, ఏపీలోని వైకాపాలు కూడా అలానే ఆలోచించాయి.  కానీ, దేశం మొత్తం దాదాపుగా మోడీ వైపు ఉన్నది.  2014లో మోడీకి ఇచ్చిన మెజారిటీ కంటే కూడా 2019లో మోడీకి ఇచ్చిన మెజారిటీ మరింత ఎక్కువగా ఉండటం విశేషం.  


ఇది పార్టీకి బాగా ఉపయోగపడింది.  బీజేపీకి  అవసరం లేకపోయినా.. ఎన్డీయేలోని మిత్రపక్షాలకు కూడా మంత్రి పదవులు కట్టబెట్టింది.  దీంతో ప్రాంతీయ పార్టీలుగా చక్రం తిప్పుతున్న తెరాస, వైకాపాలు డీలా పడ్డాయి.  మద్దతు అవసరమైతే కేంద్రానికి ఇచ్చి అక్కడి నుంచి ప్రత్యేక హోదా తెచ్చుకుందామని అనుకున్నారు.  కానీ ఇప్పుడు అది అసాధ్యం అని తేలిపోయింది.  2019 ఎన్నికల్లో బీజేపీ తెలంగాణలో నాలుగు అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంది.  


ఇది ఆ పార్టీకి శుభసూచికం అని చెప్పాలి. అది కెసిఆర్ కు నచ్చలేదు.  అప్పటి నుంచి కెసిఆర్ మోడీతో విభేదిస్తూ వస్తున్నారు.  కాళేశ్వరం ప్రాజెక్ట్ ఓపెనింగ్ సమయంలో కూడా కెసిఆర్ మోడీని పిలవలేదు.  అలానే బీజేపీని వ్యతిరేకించిన డీఎంకే పార్టీతో దోస్తీ కట్టాడు.  అయితే, కేంద్రంతో అవసరాలు ఎలా ఉంటాయో చెప్పక్కర్లేదు.  నిధుల విషయం నుంచి అన్నింటా కేంద్రంతో అవసరం ఉంటుంది.  దీనికోసం కేంద్రంతో సఖ్యతగా ఉండాలి.  రాష్ట్రప్రయోజనాల కోసం రాజీపడక తప్పదు.  


పైగా ఇప్పుడు తెలంగాణకు తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షురాలు తమిళిసై గవర్నర్ గా వచ్చారు.  ఆమె వచ్చిన తరువాత కెసిఆర్ లో కొంత మార్పు కనిపించింది.  తమిళిసై ఢిల్లీ వెళ్లి మోడీతో భేటీ అయ్యి వచ్చిన తరువాత, కెసిఆర్ ఢిల్లీ వెళ్లేందుకు సిద్ధం అయ్యారు.  ఈరోజు 11 ఉదయం గంటలకు కెసిఆర్ మోడీని కలుస్తున్నారు.  ఇద్దరి మధ్య రాష్ట్రానికి సంబంధించిన కొన్ని విషయాల గురించి చర్చకు వచ్చే అవకాశం ఉంది.  అలానే ఈనెల 5 వ తేదీన వైఎస్ జగన్ కూడా ఢిల్లీ వెళ్తున్నారు.  అక్కడ మోడీతో భేటీ కాబోతున్నారు.  అక్టోబర్ 15వ తేదీన రాష్ట్రానికి రావాలని, రైతు భరోసా పధకం మోడీ చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయించాలని చూస్తున్నారు.  ఒకవేళ మోడీ అక్టోబర్ 15న అమరావతి వస్తే.. అది బీజేపీ శ్రేణులకు కూడా కొంత ఉత్సాహంగా కూడా ఉంటుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: