ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నేత భూమా అఖిలప్రియ భర్త భార్గవ్‌రామ్ పై కేసు నమోదయ్యింది. క్రషర్ ఇండస్ట్రీ పూర్తిగా తమకే ఇవ్వాలని భార్గవ్‌రామ్ వ్యాపార భాగస్వామిపై దాడికి పాల్పడిన ఘటనలో కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ పోలీసులు ఆయనపై కేసు నమోదుచేశారు. జిల్లాలోని దొర్నిపాడు మండలం కొండాపురానికి చెందిన శివరామిరెడ్డి అనే వ్యక్తి ఆళ్లగడ్డ పట్టణ శివారులో శ్రీలక్ష్మీ ఇండస్ట్రీస్ పేరుతో క్రషర్ ఫ్యాక్టరీ ఉంది.             

                  

ఇందులో అఖిలప్రియకు 40శాతం వాటా ఉంది. దీంతో పాటు మరో పరిశ్రమను కూడా శివరామిరెడ్డి నిర్వహిస్తున్నారు. అయితే ఆ పరిశ్రమలోని బాగస్వామిని ఇండస్ట్రీ మొత్తం వారికే ఇవ్వాలని బెదిరించారు. దీంతో అఖిల ప్రియపై కేసు నమోదయ్యింది. అయితే సరిగ్గా సంవత్సరం క్రితమే మాజీ మంత్రి అఖిల ప్రియకు భార్గవ్ రామ్ కు పెళ్లి అయ్యింది.                       

                     

చంద్రబాబు నాయుడు హయంలో తల్లి శోభ నాగిరెడ్డి మృతితో ఎమ్మెల్యే అయినా అఖిల ప్రియా, తండ్రి భూమా నాగిరెడ్డి మృతితో అఖిల ప్రియా మంత్రి పదవి దక్కించుకుంది. ఈసారి 2019 ఎన్నికల్లో ఘోరాతి ఘోరంగా 2019 ఎన్నికల్లో ఓటమిని చవిచూసింది. ఓటమి అనంతరం రాజకీయాల్లో కనిపించని అఖిల ప్రియా మొన్న ఒకసారి లోకేష్ అన్నకు రాఖీ కట్టడానికి కనిపించి, నిన్న సేవ్ నల్లమల్ల అంటూ అప్పుడప్పుడు కనిపించారు.                       


మరింత సమాచారం తెలుసుకోండి: