మధ్యప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బుధవారం అర్ధరాత్రి రైసెన్ లోని నదిలో బోల్తా పడింది. 30 ప్రయాణికులతో ప్రయాణిస్తున్న ఓ బస్సు బోల్తా పడటంతో 6 మంది తీవ్రంగా మృతి చెందగా మరో 19 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.             

                                    

ఈ ఘటన సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఒకే వారంలో ఇది రెండోసారి ఘోర ప్రమాదం. మొన్నటికి మొన్న గుజరాత్ లో రోడ్డు ప్రమాదం జరగగా అందులోను అక్కడిక్కడే 22 మంది మృతి చెందారు. దీంతో ప్రజలంతా బస్సు ప్రయాణం చెయ్యాలంటేనే భయపడుతున్నారు. మరోవైపు రోడ్లు సరిగ్గా లేక ఈ ప్రమాదాలు అన్ని జరుగుతున్నాయి.                       

                

ఏది ఏమైనా బస్సు ప్రయాణం అంటేనే ప్రజలు భయపడేలా ఘోరాలు జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు గాయాలపాలైన 19 మందిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెపుతున్నారు. కాగా ఈ రోడ్డు ప్రమాదం బస్సు డ్రైవరు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లనే జరిగుంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. మరి ఈ ఘటనకు సంబింధించిన వివరాలు తెలియాల్సి ఉంది.                     

                     

మరింత సమాచారం తెలుసుకోండి: