ఈ మద్య జనావాసాల్లోకి కృర జంతువులు రావడం కలకలం చేపుతున్నాయి.  ఎండాకాలంలో అయితే నీటి కోసం కొన్ని జంతువులు జనావాసాల్లోకి వస్తుంటాయి. మరికొన్ని మేకలు, గొర్లు, కోళ్లు ఇలాంటి వాటికోసం వస్తుంటాయి.  ముఖ్యంగా జగిత్యాల జిల్లాలో చుట్టు పక్కల ప్రాంతాల్లో ఎలుగు బంట్ల సంచారం బాగా ఉంటుంది. ఎన్నో సార్లు గ్రామాల్లో ఎలుగు బంట్ల సంచారం..వాటిని పట్టుకోవడం కూడా జరిగింది. 

తాజాగా జగిత్యాల జిల్లా మల్యాల మండలం మాండ్యపల్లిలో చిరుతు సంచారం చేయడంతో అక్కడ ప్రజలు భయాందోళనకు గురి అవుతున్నారు. స్థానిక మామిడితోటలో ఈ చిరుత సంచరించడం తో అక్కడ కొంత మంది తమ సెల్ ఫోన్ లో షూట్ చేశారు. 

ఇప్పటి వరకు ఇలా చిరుత సంచారం చూడలేదని..దాని వల్ల పశుపక్షాదులకు హాని ఉంటుందని..తమకు కూడా ప్రాణ హానీ ఉంటుందని భయాందోళనలో ఉన్నారు అక్కడి ప్రజలు. తమకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు. అంతే కాదు  ఫారెస్ట్ ఆఫీస్ వాళ్లకు ఫోన్ చిరుత సంచారం గురించి తెలియజేశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: