ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గవ ర్నర్ గౌరవ బిశ్వ భూషణ్ హరి చందన  గురువారం  చిత్తూరు జిల్లాలో  పర్యటించనున్నారు. ఆయన పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి. మ.1.25 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. మ.2.35 తిరుమలలోని  పద్మావతి అతిథి గృహంలో బస చేశారు. మ.3 గంటలకు బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీవారిని దర్శనం చేసుకుంటారు. 3.30 శ్రీవారి దర్శనాoతరం పద్మావతి అతిథి గృహానికి చేరుకుంటారు. 3.45 తిరుమల నుండి రేణిగుంట బయలుదేరతారు. 4.45 రేణిగుంట విమానాశ్రమానికి చేరుకుంటారు. ఈ మేరకు చిత్తూరు డిడి,ఐ అండ్ పి.ఆర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 


సీఎం క్యాంపు కార్యాలయంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి  సమీక్షలు సమావేశాలను నిర్వహించనున్నారు. మార్కెటింగ్ శాఖ, సహకార రంగాలపై ఉదయం 10:30 గంటలకు సీఎం జగన్ సమీక్ష చేస్తారు. పౌష్టికాహారం , మిడ్ డే మిల్స్ పై మధ్యాహ్నం 3:30 గంటలకు సీఎం జగన్ సమీక్ష సమావేశాన్ని నిర్వహిస్తారు. ఆయా సమావేశాలజు సంబంధితమంత్రులు , ప్రభుత్వ అధికారులు  హాజరుకానున్నారు. 

టీడీపీ అధినేత చంద్రబాబు ఈ నెల 10, 11 తేదీల్లో విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీ శ్రేణులను కలిసి వారిలో పునరుత్తేజం తెచ్చేందుకు ఆయన జిల్లాల పర్యటన తలపెట్టిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఈ జిల్లాకు వెళ్తున్నారు.



ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతోపాటు 13 రాష్ట్రాల్లో గురువారం భారీవర్షాలు కురుస్తాయని ఢిల్లీలోని కేంద్ర వాతావరణశాఖ తాజా బులిటిన్ లో వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాయలసీమ ప్రాంతంతోపాటు తమిళనాడు, కేరళ, దక్షిణ కర్ణాటక, రాజస్థాన్, బీహార్ రాష్ట్రాల్లో గురువారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవవచ్చని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. ఉత్తరాఖండ్, పంజాబ్, తూర్పు ఉత్తరప్రదేశ్, ఒడిశా, జార్ఖండ్, బీహార్, పశ్చిమబెంగాల్, అసోం రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంతోపాటు అక్కడక్కడా పిడుగులు కూడా పడే అవకాశముందని కేంద్ర వాతావరణశాఖ హెచ్చరించింది.



మరింత సమాచారం తెలుసుకోండి: