పండుగ సీజన్ వచ్చిందంటే ఆన్ లైన్ స్టోర్లు భారీ డిస్కౌంట్ సేల్స్ పెడుతున్నాయి. దీంతో వినియోగదారులు అధిక సంఖ్యలో తమకు కావాల్సిన వస్తువులను కొనుగోలు చేస్తున్నారు. ఇది ఇప్పటి ట్రెండ్. కానీ ఎప్పటినుంచో ఉంటున్న స్టోర్ల పరిస్థితి ఏంటి. అందుకే వారు కూడా తమ మార్జిన్లు తగ్గించుకుని మరీ డిస్కౌంట్లు ఇస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటున్నారు. ప్రధానంగా ల్యాప్ టాప్స్, మొబైల్స్.. ఇవే యువత ఎక్కువగా ఆకర్షిస్తూంటాయి. వీటితో పాటు గృహోపకరణాలపైన కూడా డిస్కౌంట్లు ఇస్తూ వినియోగదారులను తమవైపుకు తిప్పుకుంటున్నారు.



మొబైళ్లలో బిగ్ సీనే తీసుకుంటే భారీ డిస్కౌంట్స్ ఇస్తోంది. ఏదొక బహుమతిని ఖచ్చితంగా ఇస్తూ వినియోగదారులను ఆకర్షిస్తోంది. సోనోవిజన్ కూడా ఇదే పద్దతి అవలంబిస్తోంది. సెల్ ఫోన్ల నుంచి గృహోపకరణాలన్నింటినీ విక్రయిస్తూ భారీ బహుమతులను ఆఫర్ చేస్తోంది. దీంతో వినియోగదారులు ఇలా స్థానిక స్టోర్లకు వచ్చేలా ఆకర్షిస్తున్నారు. వీరంతా ఎన్నో ఏళ్లుగా ఇదే పద్దతి కొనసాగిస్తూ వినియోగదారుల్లో నమ్మకం ఏర్పరచుకున్నారు. కంపెనీల నుంచి వీరికి వచ్చే ప్రయోజనాలను వినియోగదారులకు బదలాయిస్తున్నట్టు బాలు చౌదరి అంటున్నారు. డెబిట్, క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేయడం, పేటీఎమ్ ద్వారా కొనుగొలు చేయడం ద్వారా క్యాష్ బ్యాక్ ఆఫర్లు ఇవ్వడం, ఓచర్లు ఇవ్వడం ద్వారా కూడా తమ సేల్స్ పెంచుకుంటున్నారు.

 


కొన్ని ప్రముఖ సంస్థలు ఇచ్చే ఆఫర్లు..

  • సోనోవిజన్: ప్రతి రూ.2000 కొనుగోలుపై స్క్రాచ్ కార్డ్ ద్వారా రూ.100-10000 వరకూ పొందచ్చు. బ్యాంకు కార్డులపై 10 శాతం వరకు నగదు వెనక్కి ఇస్తున్నారు. లక్కీడ్రాలో 26 కార్లు గెలుపొందే అవకాశం

 

  • బజాజ్ ఎలక్ట్రానిక్స్: లక్కీ డ్రాలో 20లక్షలు, 30లక్షలు, 50లక్షలు.. కోటి రూపాయల నగదు బహుమతులతో పాటు 22 కార్లు గెలుపొందే అవకాశం

 

  • టీఎంసీ: అన్నీ వస్తువులపై భారీ తగ్గింపులతో పాటు ఐసీఐసీఐ, హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ కార్డులతో నగదు రాయితీ, క్యాష్ బ్యాక్. ప్రతి మొబైల్ పై స్పోర్స్ ఇయర్ ఫోన్

 

  • బిగ్ సీ: ప్రతి కొనుగోలుపై ఖచ్చిత బహుమతి. తొలి ఈఎంఐ ఉచితం. పేటీఎం వాలెట్ తో 30శాతం క్యాష్ బ్యాక్ – ఓచర్స్ హెడీఎఫ్ సీ బ్యాంక్ కార్డుపై 10శాతం రాయితీ. అక్టోబర్ 30 వరకు లక్కీడ్రాలో రోజుకో కారు, బైక్

 

  • హ్యాపీ మొబైల్స్: 5కోట్ల విలువైన బహుమతులు. ప్రతి కొనుగోలుపై ఖచ్చితంగా బహుమతి ఇస్తోంది. తొలి ఈఎంఐ ఉచితంగా ఇస్తోంది.

 

  • ఐటీమాల్: ల్యాప్ టాప్ లు రూ.20,000 నుంచి లభిస్తున్నాయి. 20 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్. ప్రతి కొనుగోలుపై ఖచ్చితంగా బహుమతి ఇస్తోంది

 

  • సౌత్ ఇండియా షాపింగ్ మాల్: 4కోట్ల బహుమతులు. 5 కార్లు, 5 బైకులు, 5 స్కూటర్లు, 5 వడ్డాణాలు, 10గ్రాముల పసిడి నెక్లెస్ లు, 30.. 1గ్రామ్ బంగారు నాణేలు, 50గ్రాముల వెండి గ్లాసులు, 2500 అమౌంట్ గెలుచుకునే అవకాశం

 

  • అదీశ్వర్: కిలోగ్రామ్ బంగారం, 10 కార్లు, 100 బైకులు, 40 ఎల్ ఈడీ టీవీలు, 10,000 నాన్ స్టిక్ గిఫ్ట్ సెట్ లు, గెలుచుకునే అవకాశం

 

  • చెన్నై షాపింగ్ మాల్: ప్రతి కొనుగోలుపై ఖచ్చిత బహుమతి

 

ఇలా ప్రతి ఒక్క సంస్థ ఆన్ లైన్ పోటీ నుంచి తట్టుకుని సేల్స్ నిలుపుకుంటూ, పెంచుకునేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నాయి.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: