అంతర్జాతీయంగా పాకిస్తాన్ ప్రతిచోటా భంగపాటు కలుగుతూనే ఉన్నది.  ఇప్పటికే ఐరాసలో అభాసుపాలైన పాక్ తాజాగా ఫ్రాన్స్ లో కూడా ఇబ్బందులు ఎదుర్కొంటోంది.  ఫ్రాన్స్ లోని జాతీయ అసెంబ్లీలో ప్రసంగించేందుకు అక్కడి ప్రభుత్వం పీవోకే అధ్యక్షుడు మసూద్ ఖాన్ కు ఆహ్వానం పంపింది.  ఈ విషయం తెలుసుకున్న భారత్ దౌత్యపరమైన సంబంధాలు జరిపి... మసూద్ ఖాన్ ను ఆహ్వానిస్తే.. అది భారత ప్రజాస్వామ్యానికి మచ్చతీసుకొచ్చినట్టు అవుతుందని భారత్ పేర్కొన్నది.  భారత్ చెప్పిన మాటలకు కట్టుబడిన ఫ్రాన్స్ మసూద్ ఖాన్ కు పంపిన ఆహ్వాన్ని వెనక్కి తీసుకుంది. 


మసూద్ ఖాన్ తరపున మోనీ హాజరయ్యారు.  పాక్ దౌత్యవేత్తలు తప్పా మరెవరు హాజరు కాలేదు.  ఇది భారత్ దౌత్యవిజయానికి ఒక మచ్చుతునక అని చెప్పొచ్చు.  ఉగ్రవాదంపై పోరుకు, జమ్మూ కాశ్మీర్ అంశం వంటి విషయాలపై భారత్ కు ఫ్రాన్స్ సపోర్ట్ చేస్తున్నది.  ఐరాసలోని శాశ్వత సభ్యదేశమైన ఫ్రాన్స్ ఈ విషయంలో భారత్ కు సంపూర్ణ మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే.  


కాగా, ఆర్టికల్ 370 రద్దు తరువాత ఇండియా, పాక్ దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఎలాగైనా ఇండియాను ఇరుకున పెట్టాలని పాక్ ప్రయత్నం చేస్తున్నది.  పాక్ ప్రయత్నాలను ఇండియా ఎప్పటికప్పుడు తిప్పికొడుతూనే ఉన్నది.  చివరిగా యుద్ధం చేస్తామని, అణ్వాయుధాలు ప్రయోగిస్తామని అంటోంది. పాక్ ఒక అడుగు ముందుకు వేసినా ప్రపంచపటంలో పాక్ కనిపించదని ఇండియా హెచ్చరించింది.  పాక్ తో చర్చలు జరిపే విషయంలో ఇండియా ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చింది.  


పాక్ ఉగ్రవాదాన్ని పూర్తిగా విడనాడినపుడే చర్చలు ఉంటాయని అప్పటివరకు చర్చలకు ప్రసక్తే లేదని తెలిపింది.  కాశ్మీర్ అంశంలో టర్కీ, మలేషియా, చైనాలు తప్పించి పాక్ కు మరే దేశం కూడా మద్దతు తెలపడం లేదు.  యుద్దానికి దారితీసే పరిస్థితులు వస్తే.. చైనా కూడా పాక్ కు సహకరించదు. ఎందుకంటే పాక్ కంటే చైనాకు భారత్ వలనే ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి.  వాణిజ్యపరమైన సంబంధాలు ఎక్కువగా ఉంటున్నాయి. దాన్ని చైనా వదులుకోలేదు.  


మరింత సమాచారం తెలుసుకోండి: