కొత్త వాహన చాటటం అమలులోకి వచ్చిన తరువాత వాహనదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు.  కొత్త వాహన చట్టం ప్రకారం చట్టబద్దమైన అన్ని పత్రాలు ఉంటేనే వాహనాలు రోడ్డుపై తిరిగేందుకు అనుమతి ఇస్తున్నారు.  లేదంటే భారీ జరిమానాలు వేస్తున్నారు.  ఈ జరిమానాలు భారీగా ఉండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.  చాలామంది హెల్మెట్ పెట్టుకోకుండా డ్రైవింగ్ చేయడం అలవాటుగా మార్చుకున్నారు.  


ఇలా డ్రైవింగ్ చేయడం ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయో చెప్పక్కర్లేదు.  ఖచ్చితంగా అలంటి ప్రమాదాలు జరుగుతాయి అని కాదుగాని, ప్రమాదాలు జరిగేందుకు మాత్రం అవకాశం ఉన్నది.  కొంతమంది హెల్మెట్ లను వెనుక తగిలించుకొని స్టైల్ గా వెళ్తుంటారు.  హెల్మెట్ అన్నది రక్షణ కోసం కానీ, అలా వెనుక పెట్టుకోవడానికి కాదని పోలీసులు హెచ్చరిస్తున్నారు.  


అయితే, చాలామందికి ఇష్టం లేకపోయినా హెల్మెట్ పెట్టుకోవాలి కాబట్టి పెట్టుకుంటున్నాం అన్నట్టుగా హాఫ్ హెల్మెట్ ను రోడ్డుపక్కన రెండు వందలకు కొనుగోలు చేసుకొని వెళ్తున్నారు.  అలా హాఫ్ హెల్మెట్ పెట్టుకొని వెళ్లినా ఇకపై చలానాలు పడతాయి. హాఫ్ హెల్మెట్ ను హెల్మెట్ గా గుర్తించడం లేదు.  హెల్మ్ట్ అంటే తలమొత్తానికి పెట్టుకునే వస్తువు.  అంతేగాని పెట్టుకోవాలి కదా అని చెప్పి తలకు క్యాప్ లాగ పెట్టుకుంటే  కుదరదని పోలీసులు చెప్తున్నారు.  


సో, ఇకపై బయటకు వెళ్ళాలి అనుకునే వ్యక్తులు తప్పనిసరిగా ఫుల్ హెల్మెట్ పెట్టుకొని బయటకు వెళ్ళండి.  లేదంటే జరిమానాలు కట్టాల్సి వస్తుంది.  అన్ని రకాల పత్రాలు దగ్గర ఉంచుకున్నాకే బయటకు వెళ్లేందుకు ప్రయత్నం చేయండి.  అలానే ప్రతి ఒక్కరి దగ్గర ఫిట్నెస్ కు సంబంధించిన సర్టిఫికెట్ తప్పనిసరిగా ఉండాలి.  ఒకవేళ ఫిట్నెస్ సర్టిఫికెట్ లేకుంటే 10వేలు, ఆర్సీ లేకుంటే ఐదు వేలు, డ్రైవింగ్ లైసెన్స్ లేకుంటే మరో ఐదువేలు ఫైన్ పడుతుంది.  ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. జేబుకు చిల్లులు పడతాయి జాత్రత్త.  


మరింత సమాచారం తెలుసుకోండి: