ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోడ్డు ప్రమాదంలో మరణిస్తున్న, గాయాల పాలవుతున్న పాదచారుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. కాలినడకన ఇంటి నుండి బయటకు వెళ్లినవారు ఇంటికి తిరిగి వస్తారో లేదో చెప్పలేని  పరిస్థితులు ఏర్పడుతున్నాయి. పాదచారులకు రోడ్లపై ఫుట్ పాత్ లు కనపడటం లేదు. ఫుట్ పాత్ లు ఉన్నా కొందరు ఫుట్ పాత్ లను ఆక్రమిస్తూ ఉండటంతో కాలినడకన వెళ్లేవారు ప్రమాదాలకు గురవుతున్నారు. 
 
కాలినడకన వెళ్లేవారు ఎక్కువగా చనిపోతున్న రాష్ట్రాల జాబితాలో మొదటి స్థానంలో తమిళనాడు, రెండవ స్థానంలో మహారాష్ట్ర, మూడవ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో 1,200 మందికి పైగా చనిపోతున్నారని తెలుస్తుంది. వాహనదారుల నిర్లక్ష్యం వలన ఎంతోమంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. మాజీ మంత్రి బలిరెడ్డి సత్యారావు కొన్ని రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. 
 
ఈ ప్రమాదాలు ఎక్కువగా విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, తిరుపతి ప్రాంతాలలో జరుగుతున్నాయి. ఫుట్ పాత్ లు పూర్తి స్థాయిలో లేకపోవటం, అందుబాటులో ఉన్న ఫుట్ పాత్ లు కూడా ఆక్రమణలకు గురి కావటంతో ఈ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ప్రతి ప్రధాన రహదారికి ఆనుకుని ఫుట్ పాత్ లు ఉండాలి. కానీ విశాఖపట్నంలో 25 శాతం, గుంటూరులో 16 శాతం, తిరుపతిలో 58 శాతం, విజయవాడలో కేవలం 11 శాతం మాత్రమే ఉన్నాయి. 
 
పోలీసులు, నగరపాలక సంస్థలు ఈ ప్రమాదాలపై దృష్టి పెడితే ప్రమాదాలు తగ్గే అవకాశం ఉంది. ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసి ఎక్కువమంది పాదచారులు మృతి చెందే ప్రాంతాలలో ప్రమాదాలకు సంబంధించిన కారణాల గురించి అధ్యయనం చేయాలి. ఇతర దేశాల్లో పాదచారుల భద్రత కొరకు అమలు చేస్తున్న నిర్ణయాలను మన దేశంలో కూడా అమలు చేయాలి. పాదచారుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలలో ఫుట్ ఓవర్ బ్రిడ్జీలను నిర్మించటం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చు. 



మరింత సమాచారం తెలుసుకోండి: