ఈ ఏడు తెలుగు రాష్ట్రాల్లో  సాధారణం కంటే ఎక్కువ  శాతం వర్షాలు నమోదయ్యాయి. ఇప్పటికే కుండపోతగా కురుస్తున్న వర్షాలతో ప్రజలు ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఇప్పటికే వారం రోజులుగా కుండపోతగా కురిసిన వర్షాలతో లోతట్టు  ప్రాంతాలన్నీ జలమయం అయ్యి  జన  జీవనం స్తంభించిపోయింది. అయితే తర్వాత కాస్త బ్రేక్ ఇచ్చి నట్టు కనిపించిన వానలు... గత రెండు రోజుల నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి . అయితే ఇప్పటికే కురిసిన భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులు నిండుకుండను తలపిస్తున్నాయి . 

 

 

 

 

 ఎన్నో ఏళ్ల నుంచి జలకళ సంతరించుకోని  ప్రాజెక్టులు కూడా ఈసారి నిండుకుండను తలపిస్తున్నాయి . అయితే అధికారులు కూడా ప్రాజెక్టులు వరద నీటితో  నిండటంతో  గేట్లు ఎత్తి వరద నీరు  దిగువకు వదులుతున్నారు. ఇదిలా ఉండగా తెలుగు రాష్ట్రాల్లో రాబోయే మూడు రోజులు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వాతావరణంలో వస్తున్న మార్పుల దృశ్యం క్యుములోనింబస్ మేఘాలతో... అప్పటివరకు వాతావరణం ఎలా ఉన్నప్పటికీ క్షణాల్లో  మబ్బులు కమ్ముకొని భారీ వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు. 

 

 

 

 

 హైదరాబాద్ సహా రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాల్లో భారీగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అయితే ఇప్పటికే కుండపోతగా కురిసిన వర్షాలతో జనజీవనం స్తంభించిపోయింది. దిగువ ప్రాంత ప్రజలు అష్టకష్టాలు పడ్డారు. రోడ్లపైకి వరద నీరు చేరి వాహనదారులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. అయితే ఇప్పటికీ ఎదురైనా  పరిస్థితి దృశ్య అధికారులు ముందస్తు చర్యలు తీసుకుంటే బాగుంటుందని ప్రజలు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: