అదృష్టం అన్నది చెప్పి రాదు.. చెప్పకుండా పోదు..జీవితంలో ఏదో సాధించాలని చాలా కష్టపడుతుంటారు.  కొంతమంది ఎంత కష్టపడినా జీవితంలో అనుకున్నది సాధించలేకపోతుంటారు.  ఉన్నత శిఖరాలను అధిరోహించలేకపోతుంటారు.  కొంతమంది ఈజీగా ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు.  తెలియకుండానే కోటీశ్వరులు అవుతుంటారు.  ఇలాంటి సంఘటనలు అరుదుగా జరుగుతుంటాయి.  


అదృష్టం తలుపు తట్టినపుడు తెరవాలి.  లేదంటే వెళ్ళిపోతుంది.  అలాంటి అదృష్టమే దుబాయ్ లో గత 15 ఏళ్లుగా నివాసం ఉంటున్న ఓ వ్యక్తి ఇంటితలుపు తట్టింది.  అతను ఆలస్యం చేయకుండా తలుపు తెరిచాడు.  లక్ష్మి ఇంట్లోకి వచ్చింది.  కోరి వచ్చిన అదృష్టాన్ని ఎవరైనా పారేసుకుంటారా చెప్పండి.  అసలు ఆ అదృష్టం ఏంటి.. ఎలా వచ్చింది అనే డౌట్ ఉంది కదా అక్కడికే వస్తున్నా.. 


దుబాయ్ లో ఓ కంపెనీలో అకౌంటెంట్ గా పనిచేస్తున్నాడు ప్రవీణ్.  గత పదిహేను సంవత్సరాలుగా దుబాయ్ ఉంటున్నాడు.  అలా దుబాయ్ లో ఉంటున్న ఆ వ్యక్తి తన స్నేహితులతో కలిసి డ్యూటీ ఫ్రీ లాటరీ టికెట్ కొనుగోలు చేశారు.  డ్యూటీ ఫ్రీ టికెట్ లాటరీలో ఆయనకు ఏకంగా మిలియన్ డాలర్ల ప్రైజ్ వచ్చింది.  అంతే... ప్రవీణ్ ఆనందానికి అవధులు లేవు.  మరో ఇద్దరు ఫ్రెండ్స్ తో కలిసి టికెట్ కొనుగోలు చేశానని, ప్రైజ్ సొమ్మును ఇద్దరితో కల్సి సమానంగా పంచుకుంటామని అన్నాడు.  


ఇందులో కొంతభాగాన్ని తన కూతురు చదువుకోసం వినియోగిస్తానని అన్నాడు.  ఇదిలా ఉంటె, డ్యూటీ ఫ్రీ లాటరీలో 150 మంది భారతీయులు ప్రైజ్ మనీ గెలుచుకున్నారు.  ప్రవీణ్ 151 వ్యక్తి.  దుబాయ్ లో పనిచేసే వ్యక్తులకు డ్యూటీ ఫ్రీ లాటరీ ఒక వరంలా మారడం విశేషం.  డ్యూటీ ఫ్రీ టికెట్ ను ఎంతోమంది కొనుగోలు చేస్తుంటారు.  అదృష్టం ఉన్న వాళ్లకు మాత్రమే అవకాశం వస్తుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: