పొరుగు దేశాల సాంప్రదాయం పాటించటం, పక్క  రాష్ట్రాల విధానాలు పాటించటం మన తెలుగు వాళ్ళకి మామూలే. కానీ విమర్శలు కూడా పక్క రాష్ట్రాలు ఎలా చేస్తున్నాయో చూసి అలా విమర్శించ మని కోరడం ఒకింత ఆశ్చర్యం కలిగించే విషయం. విమర్శలతో చీల్చిచెండాడిన పర్లేదు కానీ అసత్యాలు పలకకుండా, నైతిక విలువలు పాటించండి అంటూ ప్రతిపక్షాలకు హితవు పలికారు వైసిపి పార్టీ  ఎంపీ విజయసాయిరెడ్డి. ఇప్పుడు ఈ మాటలు హాట్ టాపిక్ గా మారాయి.ఏపీలో రివర్స్ టెండరింగ్ నుండి ఈమధ్య కరెంటు కోతల వరకు టీడీపీ, వైఎస్సార్సీపీ మధ్య మాటల యుద్ధం నడుస్తూనే ఉంది.



ఈ మాటల యుద్ధం లో తెలుగుదేశం అధినేత చంద్రబాబును టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి. బొగ్గు అందక విద్కుత్ కేంద్రాల్లో ఉత్పత్తి నిలిచిపోయిందని తెలిసినా కావాలనే విద్యుత్ కోతలపై అనుకూల మీడియాలో అసత్య కథనాలు రాయిస్తున్నారంటూ ధ్వజమెత్తారు.రివర్స్ టెండర్ల వల్ల రూ.7,500 కోట్లు నష్టం వస్తుందని కాకి లెక్కలు చెబుతున్నారంటూ ధ్వజమెత్తారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఐదు లక్షల కోట్ల రూపాయలు దోచుకుతిన్నారని ఆరోపించారు. వాటి సంగతి ఏంటి అన్నారు.

దాంతోపాటు వరస కరవు వల్ల వ్యవసాయ రంగం లక్ష కోట్ల ఉత్పత్తి కోల్పోయిందన్నారు. కరువు వల్ల కలిగిన నష్టం కూడా గత ప్రభుత్వాన్ని విమర్శించడం గమనార్హం. మా వాలంటీర్లకు పెళ్లిల్లే కావని, వారిది మూటలు మోసే పని అని, రిక్షా తొక్కుతూ బియ్యం సంచులు తీసుకెళ్తారని పచ్చ పార్టీ కొందరు ఔత్సాహికులు అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.  మగవాళ్లు ఇళ్లలో లేని సమయంలో వాలంటీర్లు తలుపులు కొడుతున్నారంటూ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. పార్టీలకు పత్రికలు ఉండడం మామూలు విషయమేనని మాకు కూడా పత్రికలున్నాయి.... కానీ విలువలు పాటించాలని విజయసాయి అన్నారు. 


తమిళనాడులో డీఎంకే పార్టీ ‘మురసోలి’, శివసేన పార్టీ ‘సామ్నా’ అనే పత్రికలు ఉన్నాయి. కానీ ఆ పత్రికలు ప్రత్యర్థి పార్టీలను విమర్శలతో చీల్చి చెండాడినా కొంచెం నైతిక విలువలు పాటిస్తాయని, అంతేకాదు అబద్ధాలను ప్రచురించవని చెప్పుకొచ్చారు. కానీ నీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ప్రతిపక్ష పార్టీల మీడియా అధికార పార్టీ పనితీరుపై విషం కక్కుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: