పుర్రెకో బుద్ది ఉంటుందంటారు.కాని ఆ పుర్రెలో వున్నబుద్ది రాక్షసుడిగా మారితే ఎంత ప్రమాదమో.అలాంటి వ్యక్తివల్ల ఎన్ని ప్రాణాలు పోతాయో తెలియదు.ఇకపోతే మనం ఇప్పటి వరకు రక్తాన్ని తాగే మనుషుల గురించి సినిమాల్లో మాత్రమే చూసి ఉంటాం.నిజజీవితంలో వారు ఎదురుపడితే పరిస్దితి ఎలావుంటుందో తెలియదు.కాని ఓ గ్రామంలో ఇలాంటి వ్యక్తి అక్కడి వారిని భయబ్రాంతులకు గురిచేస్తున్నాడట.ఇంతకు ఈ ఘటన ఎక్కడో తెలుసుకుందాం..



వనపర్తి జిల్లా సింగంపేట గ్రామానికి చెందిన కమ్మరి రాజు అనే వ్యక్తి పగలంతా గ్రామంలో మామూలుగా తిరుగుతుంటాడు. రాత్రయితే రక్తపిశాచిలా మారి గొర్రెలు,మేకలను ఎత్తుకెళ్లి వాటి రక్తం తాగేస్తుంటాడట.మళ్లి తిరిగి ఉదయాన్నే వాటిని యజమాని ఇంటి దగ్గర పడేస్తాడట.ఇలా రాక్షసంగా ప్రవర్తిస్తున్న రాజు ఇప్పటివరకు 60మేకలు, గొర్రెలను  చంపి రక్తం తాగినట్లు గ్రామస్థులు చెబుతున్నారు.



ఈ అలవాటు ఎలా వచ్చిందో తెలియని రాజు పదో తరగతి వరకు చదివి కూలి పనులు చేసుకుంటున్నాడని, అందరితో కలివిడిగా ఉండే అతడికి రక్తం తాగే అలవాటు ఎలా వచ్చిందో తెలీదని కుటుంబసభ్యులు,గ్రామస్థులు చెబుతున్నారు.. హాట్‌టాపిక్‌ గా మారిన రాజు వ్యవహారంపై బాధితులు ఇప్పటికే ఎన్నో పంచాయతీలు పెట్టి జరిమానాలు కూడా వసూలు చేసినా అతడిలో ఎలాంటి మార్పు కనిపించలేదని.వింత ప్రవర్తనతో అందరినీ భయపెడుతూ,మూగజీవుల రక్తం మరిగిన ఆ మనిషి పిల్లలను కూడా తీసుకుపోయి చంపేస్తాడేమోనని గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు.



దీంతో రాజును మానసిక పరిస్దితి పైన అనుమానంగా ఉందని ఇతన్ని వైద్యశాలకు పంపించి వైద్యం చేయించమని గ్రామ సర్పంచ్ అతని తల్లిదండ్రులకు చెప్పారట. అదృష్టమేంటంటే ఇతను ఇంకా మనుషుల రక్తాన్ని మరగలేదు.ఇప్పటివరకు జంతువులను మాత్రమే చంపాడు,ఈ అలవాటు క్రమక్రమంగా అతనిలోని కౄరత్వాన్ని మేల్కొలిపితే అతని పరిస్ధితి ఏంటనేది స్ధానికులకు ఓ ప్రశ్నలా మారిందట.దేవుడి దయవల్ల ఇప్పటివరకు ఇలాంటి ఘటనలేవి జరగలేదు కాబట్టి సరిపోయిందని లేకపోతే ఇతని వల్ల ఎన్ని ప్రాణాలు పోయేవో అని అంటున్నారు...

మరింత సమాచారం తెలుసుకోండి: